నవంబర్ 1 నుంచి ఫ్లిప్ కార్ట్ దివాళి సేల్
ఫ్లిప్ కార్ట్ మరో భారీ సేల్ కి తెరలేపింది. Big Billion Days sale సంచలనం మరచిపోకముందే మరొక ఫెస్టివల్ సేల్ కు రెడీ అయింది.
ఫ్లిప్ కార్ట్ మరో భారీ సేల్ కి తెరలేపింది. Big Billion Days sale సంచలనం మరచిపోకముందే మరొక ఫెస్టివల్ సేల్ కు రెడీ అయింది. దిగ్గజ సంస్థ అమెజాన్ కు సవాల్ విసురుతూ Flipkart Big Diwali Sale పేరుతో నవంబర్ 1 నుంచి భారీ ఆఫర్లకు తెరలేపనుంది. ఫ్లిప్ కార్ట్ అఫిషియల్ వెబ్ సైట్ లో ఈ సేల్ నవంబర్ 5 వరకు కొనసాగనుంది. Flipkart Big Billion Days saleలో ఆఫర్లను మిస్సయిన యూజర్లు ఈ సేల్ ద్వారా పొందవచ్చని కంపెనీ తెలిపింది. దీంతో పాటు కంపెనీ పార్టనర్ State Bank of India (SBI) కూడా కస్టమర్లకు ఇన్ స్టెంట్ డిస్కౌంట్లను, ఆఫర్లను క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా అందించనుంది.

ఈ సేల్ లో భాగంగా మొబైల్ పూర్తి ప్రొటెక్షన్ 99 రూపాయలకే లభించనుంది. దిగ్గజ కంపెనీలైన Xiaomi, Nokia, Motorola, Realme, Asus, Poco ఇతర కంపెనీ ఫోన్లు అత్యంత తక్కువ ధరకే లభించనున్నాయి.ఇందులో భాగంగా కంపెనీ Rush Hours, Price crash, and Crazy dealsను అందిచనుంది. ఈ డీల్ లో భారీ తగ్గింపు పొందనున్నఫోన్లను ఓ సారి చెక్ చేద్దాం.

Redmi Note 5 Pro
దీని ధర రూ. 12,900, కాగా రూ. 2 వేల తగ్గింపుతో అందుబాటులో ఉండనుంది.
షియోమీ రెడ్డి నోట్ 5 ప్రో ఫీచర్స్
5.99 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 2.5 డి క్వార్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకార్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసర్, 4/6 జీబి ర్యామ్, 64 జీబి స్టోరేజ్, 128 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నోగట్, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ ెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, 4 జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Vivo V11 Pro
దీని ధర రూ. 15,990, కాగా రూ. 2 వేల తగ్గింపుతో అందుబాటులో ఉండనుంది.
వివి వి 11 ప్రో స్మార్ట్ఫోన్ 6.41 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, స్నాప్డ్రాగెన్ 660 ప్రాసెసర్, 6 జీబి ర్యామ్, 128 జీబి స్టోరేజ్, 12, 5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3400 ఎంఎహెచ్ బ్యాటరీ.

Motorola One Power
దీని ధర రూ. 15,999
మోటరోరోలా వన్ పవర్ ఫీచర్లు
6.2 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 228 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకార్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసర్, 4 జీబి ర్యామ్, 64 జీబి స్టోరేజ్, 256 జీబి ఎక్స్ప్యాండబుల్ స్టోరేజ్, డ్యూయల్ సిమ్, డెడికేటెడ్ సిమ్ స్లాట్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై ), 16, 5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సెల్ సెల్ఫ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సర్, పీ 2 ఐ ఐ వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, డాల్బీ ఆడియో, డ్యూయల్ మైక్రో ఫోన్స్, 4 జీ వావోఎల్టీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 5000 ఎఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

LG G7 ThinQ
దీని ధర రూ. 29,999
ఎల్జీ జీ 7 థిం క్యు ఫీచర్లు
6.1 ఇంచ్ డిస్ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకార్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్, 4/6 జీబి ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 2 టెబి ఎక్స్పోంబబుబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సెల్ సెల్ఫ్ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4 జి వీవో ఎల్ఈఇ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3000 ఎఎహెచ్ బ్యాటరీ, క్విక్ ఛార్జ్ 3.0, వైర్లెస్ చార్జింగ్.

Nokia 5.1 Plus
దీని ధర రూ. 10,499
నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), హైబ్రిడ్ డ్యూయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 5 జీబి ర్యామ్, 32 జీబి స్టోరేజ్, 400 జీబి ఎక్స్ప్యాడబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, , 8 మెగాపిక్సెల్ సెల్ఫ్ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 4 జీ వావోఎల్టీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్బీ టైప్ సి, 3060 ఎఎహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








