Flipkart ద‌స‌రా సేల్‌.. ఈ భారీ ఆఫ‌ర్లు చూస్తే మీ మ‌తి పోతుంది!

|

దేశంలో ద‌స‌రా పండ‌గను పుర‌స్క‌రించుకుని ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ ప్లాట్‌ఫాం Flipkart భారీ సేల్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా సెప్టెంబ‌ర్ 5వ తేదీ నుంచి flipkart big Dussehra sale 2022 ప్రారంభం కానుంది. దాదాపు నాలుగు రోజుల పాటు ఈ సేల్ కొన‌సాగి అక్టోబ‌ర్ 8వ తేదీన ముగుస్తుంది. అయితే, ఈ సేల్‌లో భాగంగా యూజ‌ర్లు కళ్లు చెదిరే ఆఫ‌ర్లను పొంద‌నున్నారు. వివిధ కంపెనీల‌కు చెందిన ప‌లు ఉత్ప‌త్తుల‌పై భారీ ఆఫ‌ర్లు ఈ సేల్‌లో ల‌భించ‌నున్నాయి. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ప్రత్యేకమైన డీల్‌లను అందించ‌నున్నారు. బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లను ఉత్తమ ఆఫర్‌లలో కొనుగోలు చేసే అవకాశాన్ని మీకు అందిస్తుంది.

Flipkart

flipkart big Dussehra sale 2022 ఇప్పుడు ప్లస్ సభ్యులకు ఒక‌రోజు ముందే ప్రారంభం అయింది. Flipkart యొక్క తాజా పండుగ సీజన్ సేల్ మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హెడ్‌ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన తగ్గింపులను అందిస్తుంది. ఒకవేళ మీరు గత నెల బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను కోల్పోయినట్లయితే, మీకు ఇష్టమైన గాడ్జెట్‌లను తగ్గింపు ధరలలో పొందేందుకు ఇది మరో అవకాశం గా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమమైన డీల్‌లు మరియు ఆఫర్‌లను మేము ఎంపిక చేసుకున్నాము.

Poco X4 Pro 5G:

Poco X4 Pro 5G:

సాధార‌ణ ధ‌ర‌: రూ.23,999, డీల్ ధ‌ర‌: రూ.16,999

Poco X4 Pro 5G మొబైల్ యొక్క (6GB, 128GB) వేరియంట్ సాధార‌ణ ధ‌ర వ‌చ్చేసి రూ.23,999 గా ఉంది. కానీ, ఇప్పుడు బిగ్ దసరా సేల్ 2022 సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16,999 కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. Poco X4 Pro 5G మొబైల్ Qualcomm Snapdragon 695 SoC ద్వారా ర‌న్ అవుతుంది. దీనికి, 6GB RAM మద్దతు ఉంది. స్మార్ట్‌ఫోన్ 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.

Google Pixel 6a:

Google Pixel 6a:

సాధార‌ణ ధ‌ర‌: రూ.43,999, డీల్ ధ‌ర‌: రూ.34,199

Google Pixel 6a మొబైల్ 128GB వేరియంట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 సందర్భంగా రూ.34,199 కే ల‌భించ‌నుంది. దీని సాధార‌ణ ధ‌ర వ‌చ్చేసి MRP రూ. 43,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బండిల్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.16,900 కూడా పొంద‌వ‌చ్చు. HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులు మొబైల్ కొనుగోలుపై రూ.1,500 విలువైన అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ కూడా అదనంగా అన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ చెల్లింపులపై రూ.2,500 తగ్గింపు అందిస్తోంది.

Samsung Galaxy Watch 4:

Samsung Galaxy Watch 4:

సాధార‌ణ ధ‌ర‌: రూ.29,999, డీల్ ధ‌ర‌: రూ.11,499

Samsung Galaxy Watch 4 సాధార‌ణ ధ‌ర రూ.29,999గా ఉంది. కానీ, ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ సందర్భంగా దీన్ని రూ.11,499 కొనుగోలు చేయ‌వ‌చ్చు. HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులు అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. Samsung Galaxy Watch 4 హెల్త్‌ మరియు గొప్ప కనెక్టివిటీ ఫీచర్‌ల సెట్‌తో వస్తుంది.

Google Pixel Buds A-సిరీస్:

Google Pixel Buds A-సిరీస్:

సాధార‌ణ ధ‌ర‌: రూ.9,999, డీల్ ధ‌ర‌: రూ.5,999

Google Pixel Buds A-Series TWS ఇయర్‌బడ్స్ సాధార‌ణ ధర రూ.9,999 గా ఉంది. కానీ, ఈ వారం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దసరా సేల్ 2022 సందర్భంగా ఇవి రూ.5,999 కొనుగోలు చేయ‌వ‌చ్చు. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, మీరు దానిని ఎక్స్‌చేంజ్ చేసుకునే అవ‌కాశం కూడా క‌ల్పిస్తున్నారు. త‌ద్వారా Pixel Buds A-Series TWS ఇయర్‌బడ్స్‌పై 5,450 త‌క్ష‌ణ త‌గ్గింపు పొంద‌వ‌చ్చు.

Realme 9 Pro 5G:

Realme 9 Pro 5G:

సాధార‌ణ ధ‌ర‌: రూ.21,999, డీల్ ధ‌ర‌: రూ.16,599

మీరు సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Realme 9 Pro 5G మొబైల్ మంచి ఎంపిక‌. దీని సాధార‌ణ ధ‌ర మార్కెట్లో రూ.21,999గా ఉంది. కానీ, ప్ర‌స్తుతం ద‌స‌రా సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ రూ.16,599 కొనుగోలు చేయ‌వ‌చ్చు. Realme 9 Pro మొబైల్ Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌తో ఆధారితమైనది, దీనికి 6GB RAM మద్దతు ఉంది. స్మార్ట్‌ఫోన్ 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

AirPods ప్రో (రూ. 15,999)

AirPods ప్రో (రూ. 15,999)

సాధార‌ణ ధ‌ర‌: రూ.26,300, డీల్ ధ‌ర‌: రూ.15,999

ఈ AirPods ప్రో సాధార‌ణ ధ‌ర రూ.26,300 గా ఉంది. కానీ, ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ ద‌స‌రా సేల్‌లో భాగంగా వీటిని రూ.15,999 కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇవి యాపిల్ ఫ‌స్ట్ జెన్ ఎయిర్ పాడ్స్‌. కాగా, యాపిల్ ఇటీవల తన ఐఫోన్ 14 లాంచ్ ఈవెంట్ సందర్భంగా రెండవ తరం ఎయిర్‌పాడ్స్ ప్రోని పరిచయం చేసింది. రెండో త‌రం AirPods లాంచ్ ధ‌ర రూ.27,000 గా ఉంది.

Best Mobiles in India

English summary
Flipkart big Dussehra sale 2022 starts from oct 5th. check the best deals here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X