Flipkart Big Saving Days Sale 2020: ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద ఆఫర్లే ఆఫర్లు!!
ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగస్టు 6 నుండి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సేల్ లో కొన్ని స్మార్ట్‌ఫోన్ల మీద అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఇప్పటికే ఆవిష్కరించబడ్డాయి. ఈ సేల్ ఆగస్టు 6న మొదలై ఆగస్టు 10 తో ముగుస్తుంది.

ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్
ఈ-కామర్స్ దిగ్గజం సిటీబ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకొని అమ్మకం సమయంలో కొనుగోళ్ల మీద 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఐఫోన్ XR, ఒప్పో రెనో 2F, ఐఫోన్ SE, రెడ్‌మి K20 ప్రో వంటి ఫోన్ల మీద ధర తగ్గింపుతో పాటుగా అద్బుతమైన క్యాష్ బ్యాక్ లు కూడా లభిస్తాయి. మోటరోలా రేజర్ ఫోల్డబుల్ ఫోన్ గొప్ప తగ్గింపుతో ప్రస్తుతం రూ.20,000 ధర వద్ద లభిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ డిస్కౌంట్ ఆఫర్‌లు
ఫ్లిప్‌కార్ట్ సంస్థ తన బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో తగ్గింపు ధరల వద్ద రెండు ఐఫోన్‌లను అందిస్తున్నది. ఈ రెండింటిలోను వాస్తవ ధరల కంటే తగ్గింపు ధర వద్ద లభిస్తాయి. ఐఫోన్‌లతో పాటు కొన్ని ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్‌లు కూడా ధర తగ్గింపులతో పొందవచ్చు. ప్రస్తుతం మీరు కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను పొందాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ అమ్మకం సరైన సమయం కావచ్చు. ఇందులో ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్‌లలో కొన్ని గొప్ప ఆఫర్‌లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకం సమయంలో డిస్కౌంట్ ను అందిస్తున్న ఫోన్‌ల జాబితాను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్ మీద తగ్గింపు ధరలు
రూ.49,900 ధర గల ఐఫోన్ XR ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకం సమయంలో కేవలం రూ.44,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లపై GST రేటు పెరిగిన తరువాత భారతదేశంలో ఐఫోన్ XR యొక్క బేస్ 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,900 నుండి రూ.68,300 కు పెరిగింది. అంటే ఇది ఇండియాలో విడుదలైనప్పటి ధరతో పోలిస్తే దాదాపు రూ.23,000ల ధర తగ్గింపుతో లభిస్తున్నది. బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వంటి మరిన్ని బహుళ ఒప్పందాల ఆధారంగా ఫ్లిప్‌కార్ట్ ఈ డిస్కౌంట్‌ను అందించే అవకాశం ఉంది.

ఒప్పో ఫోన్ల మీద డిస్కౌంట్ ఆఫర్లు
ఒప్పో రెనో 2F యొక్క ధర ఇండియాలో రూ.23,490 కాగా అమ్మకం సమయంలో రూ.17,990 ధర వద్ద పొందవచ్చు. అంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకం సమయంలో దీని మీద రూ.5,500 వరకు డిస్కౌంట్ అందిస్తున్నది. ఐఫోన్ SE 2020 ని ఈ అమ్మకం సమయంలో రూ.36,999 ధర వద్ద పొందవచ్చు. ఇండియాలో దీనిని రూ. 42.500 ప్రారంభ ధర వద్ద విడుదల చేసారు. అదేవిధంగా రెడ్‌మి K20 ప్రో ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మోడల్ ను రూ.4,000 తగ్గింపు ధరతో రూ.22,999 ధర వద్ద పొందవచ్చు. ఇటీవల పెరిగిన ధరతో ప్రస్తుతం దీని యొక్క ధర రూ. 26,999.

ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మీద డిస్కౌంట్ ఆఫర్లు
మోటరోలా రేజర్ 2019 ప్రీపెయిడ్ కొనుగోళ్లపై రూ.20,000 తగ్గింపుతో ఫోన్ రూ.1,24,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఒప్పో రెనో 10X జూమ్ రూ.39,990, ఐఫోన్ 7 ప్లస్ రూ.36,998 మరియు ఐక్యూఓ 3 వంటి అనేక ఇతర స్మార్ట్‌ఫోన్‌లు కూడా అద్భుతమైన ఒప్పందాలతో జాబితా చేయబడతాయి. ఈ అమ్మకం సమయంలో అందించే మరిన్ని ఒప్పందాల వివరాలను ముందు ముందు ఇంకా విడుదల చేయనున్నది.


Click it and Unblock the Notifications








