ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్‌లు, టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో కొత్తగా మరొక సేల్!!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన యొక్క ప్లాట్‌ఫామ్‌లో 2021 సంవత్సరంలో బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరొక సేల్ ను ప్రకటించింది. ఈ అమ్మకం జనవరి 20న ప్రారంభమై జనవరి 24 వరకు నిర్వహించనున్నది. ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఒక రోజు ముందస్తు యాక్సిస్ ను అందిస్తుంది. అంటే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ముందస్తు యాక్సిస్ జనవరి 19 ఉదయం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్ బ్యాంక్ ఆఫర్
ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో ఐదు రోజులపాటు జరిగే 'బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వినియోగదారులకు 10% వరకు తక్షణ తగ్గింపును అందిస్తుంది. అలాగే ఈ ఆఫర్‌లో నో-కాస్ట్ EMI లావాదేవీలు కూడా ఉంటాయి.

స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్
ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ సేవింగ్ డేస్ అమ్మకం 2021లో శామ్‌సంగ్, ఆపిల్, మోటరోలా మరియు ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. ఇందులో ముఖ్యంగా శామ్‌సంగ్ గెలాక్సీ F41, ఆపిల్ ఐఫోన్ XR, మోటరోలా మోటోg 5G, శామ్‌సంగ్ గెలాక్సీ S20 ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తుందని ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ వెబ్‌పేజీ
ఫ్లిప్‌కార్ట్ కొత్తగా విడుదల చేసిన వెబ్‌పేజీ ప్రకారం ఎలక్ట్రానిక్స్ మరియు వాటి యొక్క ఉపకరణాల మీద కూడా 80% వరకు తగ్గింపును అందిస్తున్నది. వీటి యొక్క కొనుగోలు మీద నో-కాస్ట్ EMI వద్ద కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా టీవీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు గృహోపకరణాల కొనుగోలు మీద ఫ్లిప్‌కార్ట్‌లో 75% వరకు తగ్గింపుతో అందివ్వనున్నది.

ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ లో త్వరలో కొత్తగా నిర్వహించే అమ్మకంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలు మీద 60% తగ్గింపును ఇవ్వబోతోంది. కొనుగోలుదారులు ల్యాప్‌టాప్‌లను రూ.15,000 ధర వద్ద కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తున్నది. అలాగే హెడ్‌ఫోన్‌ల మీద 75% వరకు డిస్కౌంట్ , టాబ్లెట్‌లపై 45% తగ్గింపు, కెమెరా ఉత్పత్తులపై 60% వరకు, స్మార్ట్‌వాచ్‌ల మీద 70% వరకు మరియు స్పీకర్లు వంటి మరిన్ని వాటి మీద 70% వరకు ఊహించని డిస్కౌంట్లను అందివ్వనున్నది.


Click it and Unblock the Notifications