Home
News

Flipkart బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్ తేదీలు వెల్లడి.. ఈ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌.. పూర్తి వివరాలు

ప్రముఖ ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌ కార్ట్ కొత్త సేల్‌ వివరాలను ప్రకటించింది. మే 3 వ తేదీ నుంచి 9 వరకు బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ ( Flipkart Big saving Days Sale 2024 ) పేరుతో ఈ సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్లు ఒక రోజు ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Sale 2024) బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2024 లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లు సహా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లను పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. దీంతోపాటు గృహోపకరణాలపైనా తగ్గింపు ధరలను పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

Flipkart Big saving Days Sale 2024 announced in india

ఈ ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు, EMI లావాదేవీలు నిర్వహించే కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. దీంతోపాటు యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డులపై 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2024 లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ను వినియోగించుకోవాలని సంస్థ కోరింది. దీని ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఈ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉందని తెలిపింది. యూపీఐ లావాదేవీలపై గరిష్ఠంగా 50 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని పేర్కొంది.

Flipkart Big saving Days Sale 2024 announced in india

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2024 లో భాగంగా ఆపిల్‌, శాంసంగ్‌, రియల్‌మి, మోటోరోలా సహా అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లును పొందవచ్చని తెలుస్తోంది. అయితే ఎంత శాతం డిస్కౌంట్‌ ఉంటుందో ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు. ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపైనా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండనున్నాయి.

టీవీలు, స్మార్ట్‌టీవీలు సహా ఇతర గృహోపకరణాలపై భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఏయే బ్రాండ్ల ఉత్పత్తులపై ఎంత డిస్కౌంట్‌ ఉంటుందో సంస్థ వెల్లడించలేదు. దీంతోపాటు వేసవి కాలం దృష్ట్యా ఎయిర్‌ కండిషనర్‌, ఎయిర్‌ కూలర్ సహా ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది.

అయితే ఈ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2024 మే 3 న ప్రారంభం అవుతుంది. 9 వ తేదీ వరకు సేల్‌ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్లు అత్యంత వేగంగా డెలివరీలు పొందనుండగా.. ఇతర వినియోగదారులు కూడా త్వరతగతిన డెలివరీలు పొందే అవకాశం ఉంది. త్వరలో ఈ సేల్‌ పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big saving Days Sale 2024 announced in india here are the best deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X