Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 ప్రారంభం.. ఈ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్..!
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇవాళ్టి నుంచి ప్రత్యేక సేల్‌ను (Flipkart Big Saving Days Sale 2024) ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2024 ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఈనెల 25 వరకు సేల్ జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు సహా అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు, గృహోపకరణాలపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా రూ.999 నుంచే స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు పవర్ బ్యాంక్స్ పై గరిష్ఠం 50 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2024 సేల్‌లో భాగంగా ఆపిల్, పోకో, వివో, CMF సహా మరిన్ని బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు మొబైల్ కవర్‌లను రూ.499, మొబైల్ స్పీకర్‌లను రూ.599 నుంచే అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఫ్యాషన్ ఉత్పత్తులను భారీ డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా గృహోపకరణాలను కూడా తగ్గింపు ధరల్లో కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్ బరోడా డెబిట్, క్రెడిట్ కార్డులపై గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ముఖ్యంగా ఐఫోన్ 15 ప్లస్, నథింగ్ CMF ఫోన్ 1, వివో T3 ప్రో మరియు పోకో M6 5G స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ హైలెట్ చేసింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌లు మరింత తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో 2024 లో భాగంగా రూ.63999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. 128GB స్టోరేజీ, 256GB స్టోరేజీ, 512GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus Smartphone) 48MP కెమెరా, 12MP కెమెరాలు సహా 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ప్లస్ మోడల్ ఐఫోన్ 4,383mAh బ్యాటరీతో పనిచేస్తోంది. IP68 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
నథింగ్ CMF ఫోన్ 1 ను ప్రస్తుతం రూ.14999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 నథింగ్ OS 2.6 పైన పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలు సహా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
వివో T3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 పైన పనిచేస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 50MP + 8MP కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24999 గా ఉంది.


Click it and Unblock the Notifications








