Home
News

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2025.. ఈ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్!

ఫ్లిప్‌కార్ట్‌ నుంచి తాజాగా కీలక ప్రకటన వెలువడింది. బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ 2025 ను (Flipkart Big saving Days Sale 2025) ప్రారంభ తేదీని వెల్లడించింది. ఈ సేల్ మార్చి 7 వ తేదీన ప్రారంభం కానుంది. మార్చి 13 వరకు సేల్‌ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ పై భారీ డిస్కౌంట్‌లు పొందవచ్చని చెబుతోంది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపు ధరలకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం HDFC, యాక్సెస్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ 2025 లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌టీవీ, ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌, సౌండ్‌ బార్‌లు, ఇతర ఆడియో ఉత్పత్తులు సహా ఇతర గృహోపకరణాలను డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Flipkart Big saving days sale announced in march 2025

ఈ బ్యాంకు కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ :
అదే విధంగా ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ను పొందవచ్చు. దీంతోపాటు ఈ సేల్‌లో ఎక్స్ఛేంజీ ఆఫర్లు, నో కాస్ట్ EMI అఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌ కండిషన్‌, ఎయిర్‌కూలర్‌లతోపాటు ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లను పొందే అవకాశం ఉంది.

ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ లో భాగంగా కేవలం ఎలక్ట్రానిక్స్‌ మాత్రమే కాకుండా ఫ్యాషన్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు పర్సనల్‌ కేర్ ఉత్పత్తులను గరిష్ఠంగా 65 శాతం డిస్కౌంట్‌ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే సేల్‌ దగ్గర పడే కొద్ది మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

ఈ సేల్‌లో భాగంగా బ్రాండ్‌లు, కేటగిరీల వారీగా డిస్కౌంట్ల వివరాలు వెల్లడి కానున్నాయి. మరో రెండు రోజుల్లో సేల్‌ ప్రారంభం కానుంది. అయితే ప్రతి సేల్‌ సమయంలో ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్‌లకు 12 గంటల ముందుగానే యాక్సెస్‌ ఉండేది. అయితే ఈ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ లో ప్లస్‌ మెంబర్‌ల ప్రయోజనాల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్‌ డేస్ సేల్‌ 2025 లో భాగంగా ఆపిల్‌, శాంసంగ్‌, వివో, నథింగ్‌, రియల్‌మి, పోకో, ఒప్పో సహా ఇతర అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌ లను డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు గృహోపకరణాలను కూడా తక్కువ ధరకు పొందవచ్చు. వాషింగ్‌ మెషిన్‌లు, AC, ఎయిర్‌కూలర్‌లపై తగ్గింపు ధరలను పొందవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా Asus వివోబుక్‌ i3 మోడల్‌ను రూ.29,990 గా ఉంది. దీంతోపాటు బ్లూస్టార్‌ 1.5 Ton 3 స్టార్‌ AC ను రూ.32260 గా ఉంది. దీంతోపాటు జీబ్రానిక్స్‌ సౌండ్‌బార్స్‌ను రూ.1499 కే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్‌ 16 సిరీస్‌తోపాటు ఇటీవల విడుదల అయిన నథింగ్‌ ఫోన్‌ 3a సిరీస్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big saving days sale announced in march 2025 here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X