ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ టీజర్ వచ్చింది! ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం హోలీ సేల్‌ను వివిధ కేటగిరీల్లోని పరికరాలపై అనేక డిస్కౌంట్లను అందిస్తూ నిర్వహిస్తోంది. ఈ హోలీ సేల్ ఇంకా ముగింపు కు రాక ముందే, ఇ-కామర్స్ దిగ్గజం బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో మరో సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ యొక్క తేదీలు కూడా మార్చి 11న ప్రారంభమై మార్చి 15 వరకు ప్రకటించింది.

అయితే, మార్చి 10 నుంచి కూడా ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యుల కోసం బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమవుతుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇప్పుడు, ప్లస్ సభ్యులుగా ఉన్న వినియోగదారులకు ఇది వర్తిస్తుంది.ఈ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ లాగానే పనిచేస్తుంది మరియు ఉచిత డెలివరీ, డిస్కౌంట్‌లకు ముందస్తు యాక్సెస్ మరియు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ పోస్ట్ చేసిన టీజర్ ప్రకారం
ప్రస్తుతానికి, ఇ-కామర్స్ దిగ్గజం ఈ సేల్ లో అందించే బ్యాంక్ ఆఫర్‌లను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లపై కొన్ని డిస్కౌంట్ ఆఫర్‌లను ధృవీకరించింది. ఫ్లిప్‌కార్ట్ పోస్ట్ చేసిన టీజర్ ప్రకారం, ఐఫోన్ 14 సిరీస్, గూగుల్ పిక్సెల్ ఫోన్లు మరియు శాంసంగ్, పోకో, రియల్ మీ మొదలైన వివిధ మోడళ్ల ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లను కలిగి ఉన్నట్లు ప్రకటించారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో లభించే కొన్ని బెస్ట్ ఆఫర్ డీల్‌లను ఇక్కడ చూద్దాం.

ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్
ఇటీవలే లాంచ్ అయిన, ఐఫోన్ 14 సిరీస్ ప్రస్తుతం డిస్కౌంట్‌తో లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్ భారీ తగ్గింపుతో లభిస్తాయని ప్లాట్‌ఫారమ్ వెల్లడించింది. ఖచ్చితంగా ఎంత తగ్గింపు ఆఫర్ ఉంటుందో ఇంకా వెల్లడి కాలేదు కానీ ఈ ఫోన్‌లు రూ. 70000 లోపు లభిస్తాయని టీజర్ సూచిస్తోంది. దీనికి తోడు బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉంటాయి.

శాంసంగ్ గెలాక్సీ S21 FE
ఫ్లిప్‌కార్ట్ టీజర్ ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ S21 FE ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో రూ. 12,990 ఆఫర్ తో తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ డీల్‌కు కొన్ని నిబంధనలు మరియు షరతులు జతచేయబడతాయని టీజర్ వెల్లడించింది. మరిన్ని వివరాలను వెల్లడించడానికి ఫ్లిప్‌కార్ట్ నుంచి సమాచారం కోసం వేచి ఉండాలి.

రెడ్ మీ నోట్ 12 ప్రో+ 5G
రెడ్ మీ నోట్ 12 ప్రో+ 5G కూడా తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ టీజర్ వెల్లడించింది. ఈ ఫోన్ పై ఫ్లాట్ తగ్గింపు ఆఫర్‌తో పాటు, బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది దీని కారణంగా ఈ ఫోన్ ధరను మరింత తగ్గించి మరింత మెరుగైన డీల్ చేస్తుందని మేము నమ్ముతున్నాము.

గూగుల్ పిక్సెల్ 7
గూగుల్ పిక్సెల్ 7 ఫోన్ కేవలం రెండు నెలల క్రితం రూ. 59,999 లాంచ్ ధరతో లాంచ్ చేయబడింది. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో, పిక్సెల్ 7 సిరీస్ ఫోన్ మీకు . రూ. 50,000 లోపు అందుబాటులో ఉంటుంది. ఇది అద్భుతమైన డీల్ అవుతుంది. ఇంకా, పిక్సెల్ 7 ప్రో ఫోన్ కూడా తగ్గింపు ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంటుంది. ఖచ్చితమైన ఆఫర్ ధరను ఇంకా వెల్లడి చేయలేదు.

నథింగ్ ఫోన్ (1)
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో నథింగ్ ఫోన్ (1) కూడా తగ్గింపు ధర తో అందుబాటులో ఉంటుంది. తుది ధర వెల్లడి కాలేదు కానీ మీ ఫోన్ రూ. 30,000 లోపు అందుబాటులో ఉంటుందని ఈ టీజర్ వెల్లడించింది. ఖచ్చితమైన ఆఫర్ ధర ఇంకా వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








