Home
News

ఫ్లిప్కార్ట్ సేల్ లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు ! వివరాలు చూడండి

By Maheswara

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ తేదీ ని ప్రకటించారు.ఈ సేల్ మే 5 నుంచి మే 10 వరకు జరుగుతుంది. ఈ సేల్ లో శాంసంగ్ క్రిస్టల్ 4K మరియు Mi X సిరీస్ 4K స్మార్ట్ టీవీల ధరలు భారీగా తగ్గించబడ్డాయి. కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయడానికి ఆలోచిస్తున్న వినియోగదారులకు 4K టీవీని కొనుగోలు చేసే సమయం ఆసన్నమైంది.

ఈ రోజుల్లో ప్రజలు వ్యక్తిగతంగా కంటే ఆన్‌లైన్‌లో నే వస్తువులను ఎక్కువ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక టీవీ లు మరియు ఇతర గాడ్జెట్లు అయితే ఆర్డర్ ఇస్తే చాలు మీ ఇంటికి డెలివరీ ఇచ్చి సెటప్ చేసి రిమోట్ ఇచ్చి వెళ్లిపోతారు. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మరియు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ ఎలక్ట్రానిక్స్‌పై చాలా చౌక ధర ఆఫర్ లను కూడా అందిస్తున్నాయి.

Flipkart Big Saving Days Sale Date Announced, Top Deals On Smart Tvs Showcased. Offers Details Here.

దీని ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ మే 5న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. ఈ ప్రత్యేక సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు మొదలైనవన్నీ తక్కువ ధరలకు లభిస్తాయి. ముఖ్యంగా శాంసంగ్ క్రిస్టల్ 4K మరియు Mi X సిరీస్ 4K టీవీల ధరలు భారీగా తగ్గించబడ్డాయి.

శాంసంగ్ క్రిస్టల్ 4K స్మార్ట్ టిజెన్ టీవీ ఫీచర్లు: ఈ టీవీలో 43 అంగుళాల LED డిస్‌ప్లే ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 4K రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఆడియో విషయానికొస్తే రెండు 20w స్పీకర్లు ఉన్నాయి. మూడు HDMI పోర్ట్‌లు, ఒక USB పోర్ట్ మరియు ఒక హెడ్‌ఫోన్ పోర్ట్ ఉన్నాయి.

స్క్రీన్ మిర్రరింగ్, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా రిమోట్‌గా యాక్సెస్ అందించబడుతుంది. ఈ టీవీ బరువు 8.1 కిలోలు. Netflix, Disney+ Hotstar, YouTube యాప్‌లు అందించబడ్డాయి. ఇక ధర విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ.29,990 కు అందుబాటులో ఉంది. దీనికి,1 సంవత్సరం వారంటీ అందుబాటులో ఉంది.

ఇంకా, ఈ ధరపై మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి 5 శాతం ఆఫర్‌ను పొందవచ్చు. అదేవిధంగా, మీరు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. ముఖ్యంగా పాత టీవీని మార్చుకోవడం ద్వారా రూ. 4,789 తగ్గింపు పొందండి.

Mi X సిరీస్ 4K (43 అంగుళాలు) (Mi X సిరీస్ 4K TV) ఫీచర్లు: ఈ టీవీలో 43 అంగుళాల LED డిస్‌ప్లే ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 4K రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఆడియో విషయానికొస్తే రెండు 30w స్పీకర్లు ఉన్నాయి. మూడు HDMI పోర్ట్‌లు, ఒక USB పోర్ట్, ఒక హెడ్‌ఫోన్ పోర్ట్ మరియు ఒక ఈథర్ నెట్ పోర్ట్ లు ఉన్నాయి.

స్క్రీన్ మిర్రరింగ్, వైఫై, బ్లూటూత్ అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ యాక్సెస్ రిమోట్‌గా అందించబడుతుంది. ఈ టీవీ 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ , డిస్నీ+ హాట్ స్టార్, యూట్యూబ్ యాప్‌లు అందించబడ్డాయి.

ఈ టీవీ ధర రూ.28,999గా నిర్ణయించబడింది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ధరపై 5 శాతం ఆఫర్‌ను పొందండి. అదేవిధంగా మీరు ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మీ పాత టీవీని మార్చుకోవడం ద్వారా రూ.16,900 వరకు తగ్గింపు పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Saving Days Sale Date Announced, Top Deals On Smart Tvs Showcased. Offers Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X