ఫ్లిప్కార్ట్ కొత్త సేల్, అన్ని టాప్ బ్రాండ్ల ఫోన్ల పై భారీ ఆఫర్లు! లిస్ట్ చూడండి.
ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 ఇప్పుడు మొదలైంది. ఈ ఫ్లిప్కార్ట్ సేల్ లో ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప ఆఫర్ డీల్‌లను అందిస్తోంది. ఈ సేల్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్‌ల కోసం నిన్ననే ప్రారంభమైంది మరియు ఈ రోజు నుండి, నాన్-ప్లస్ సభ్యులు అందరికీ కూడా అన్ని డీల్‌లు మరియు ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి.
ఈ ఫ్లిప్కార్ట్ సేల్ అమెజాన్ యొక్క గ్రేట్ సమ్మర్ సేల్ కు పోటీగా జరుగుతోంది. మీరు కొత్త హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఇది తుది నిర్ణయం తీసుకునే ముందు ధరలను మళ్ళీ చెక్ చేసుకునే అవకాశాన్ని కొనుగోలుదారులకు అందిస్తుంది.

ఆపిల్, శాంసంగ్, గూగుల్, షియోమీ, రియల్ మీ మరియు రెడ్ మీ వంటి బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను గొప్ప తగ్గింపు ఆఫర్ తో అందిస్తున్నందున. ఈ సేల్ కొనుగోలుదారులకు చాలా ఎంపికలను అందిస్తుంది. ఇక ఈ సేల్ లో భారీ ఆఫర్లతో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఆపిల్ ఐఫోన్ 13 పై ఆఫర్ వివరాలు, ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 57,999 కు 17 శాతం తగ్గింపుతో మరియు ఐఫోన్ 14 రూ. 67,999 కు 14 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఇంకా, శాంసంగ్ గెలాక్సీ M14 ఫోన్ 16 శాతం తగ్గింపుతో లభిస్తుంది మరియు దీని ధర రూ. 15,066. దీనితో పాటు, శాంసంగ్ గెలాక్సీ F04 ధర రూ. 6,999 కి 39 శాతం తగ్గింపుతో లభిస్తోంది.
గూగుల్ పిక్సెల్ 6a ఫోన్ పై 36 శాతం తగ్గింపు లభిస్తుంది మరియు దీని ధర రూ. 27,999 గా ఉంది. అలాగే, పిక్సెల్ 7 మోడల్ కూడా 16 శాతం తగ్గింపును పొందింది మరియు ఇప్పుడు దీని ధర రూ. 49,999 గా ఉంది.
ఇంకా రెడ్ మీ స్మార్ట్ ఫోన్ల పై కూడా భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో, రెడ్ మీ 10 పై 36 శాతం వరకు తగ్గింపును కలిగి ఉంది మరియు దీని ధర రూ. 9,499 మరియు రూ. 10,999 మధ్య ఉంటుంది. అంతేకాకుండా, రెడ్ మీ A1+ ధర రూ. 6,499 కి 35 శాతం తగ్గింపుతో లభిస్తుంది. రెడ్ మీ 11 ప్రైమ్ మరియు రెడ్ మీ 12C రెండూ వరుసగా రూ. 12,999 మరియు రూ. 9,499 ధర కి 32 శాతం వరకు తగ్గింపుతో ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి.
షియోమీ మరియు రియల్ మీ కూడా తమ ఫోన్లపై భారీ ధర తగ్గింపు ఆఫర్ల ను కలిగి ఉన్నాయి. షియోమీ యొక్క 11T ప్రో హైపర్‌ఫోన్ రూ. 29,990 కి మరియు షియోమీ యొక్క 12 ప్రో రూ. 44,990 కి 43 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఇక, రియల్ మీ యొక్క GT నియో 3T ఫోన్ యొక్క ధర గమనిస్తే, ఇది రూ. 19,999 కి 42 శాతం వరకు తగ్గింపు తో సేల్ అవుతోంది. రియల్ మీ 10 కూడా 22 శాతం వరకు తగ్గింపు ఆఫర్ ను కలిగి ఉంది, దీని ధర రూ. 15,499 గా ఉంది.
ఈ ఆఫర్లతో పాటుగా, ఫ్లిప్‌కార్ట్ EMIల కోసం కూడా ఆప్షన్లను అందిస్తోంది మరియు SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.


Click it and Unblock the Notifications