ఫ్లిప్‌కార్ట్‌లో కొత్తగా మరొక సేల్!! స్మార్ట్‌ఫోన్‌లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్...
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు ప్రత్యేక సేల్ లను ప్రారంభిస్తుంది. ఇప్పుడు కొత్తగా మరొక సేల్ తో ముందుకు వస్తుంది. "ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్" ను ఇ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది. ఈ అమ్మకాలు మే 2 నుంచి మొదలై మే 7 వరకు జరగనున్నాయి. ఈ 5 రోజుల అమ్మకాలలో వినియోగదారులకు డిస్కౌంట్ ధరల వద్ద స్మార్ట్‌ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి అద్భుత అవకాశం అందిస్తున్నది.

ఫ్లిప్‌కార్ట్ ప్రకారం శామ్‌సంగ్ నుండి కొత్తగా వచ్చే స్మార్ట్‌ఫోన్‌ల మీద "గొప్ప తగ్గింపులు" లభిస్తాయి. అలాగే ఆపిల్, వివో, ఆసుస్ మరియు షియోమి వంటి ఇతర బ్రాండ్ల యొక్క ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద కూడా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తాయి. ఎలక్ట్రానిక్స్ మరియు వాటి ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపుతో పాటు టీవీల కొనుగోలు మీద 75 శాతం వరకు డిస్కౌంట్ ధర మీద కొనుగోలు చేయడానికి అవకాశం అందివ్వనున్నది.

కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద డిస్కౌంట్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ మైక్రోసైట్ ప్రకారం వినియోగదారులు తమకు ఇష్టమైన వస్తువులను ఈ అమ్మకపు రోజుల్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు మరియు ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద ఆఫర్లను ఎక్కువగా పీక్‌లో అందిస్తున్నది. ఇందులో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ F62 ను రూ.17,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ F41 యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.14,499 ధర వద్ద మరియు దాని 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ను అమ్మకం సమయంలో 12,499 రూపాయల తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ F12 ను రూ.9,999 ధర వద్ద పొందవచ్చు.

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు విషయానికి వస్తే రూ.58,400 ధర వద్ద లభించే ఐఫోన్ 11ను రూ.44,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఆసుస్ ROG ఫోన్ 3 ను రూ.46,999 తగ్గింపు ధర వద్ద, ఐక్యూ 3 యొక్క 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.24,990 డిస్కౌంట్ ధర వద్ద పొందవచ్చు. అలాగే Mi10 T సిరీస్‌ను రూ.27,999 ప్రారంభ ధర వద్ద ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకం సందర్భంగా కొనుగోలు చేయవచ్చు.

ఎలక్ట్రానిక్స్ వస్తువులపై తగ్గింపు ఆఫర్లు
5 రోజుల పాటు జరిగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌ల కొనుగోలు మీద 70 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే బ్లూటూత్ స్పీకర్ల కొనుగోలు మీద 70 శాతం వరకు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పవర్ బ్యాంకుల కొనుగోలు మీద 50% వరకు తగ్గింపు ఉన్నాయి. అలాగే 75 శాతం తగ్గింపుతో స్మార్ట్ టీవీలను కూడా కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు వన్‌ప్లస్ యొక్క 32 అంగుళాల స్మార్ట్ టీవీని కేవలం రూ.14,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు.


Click it and Unblock the Notifications