Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!!
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం Flipkart Big Saving days పేరుతో భారీ ఆఫర్ల, డిస్కౌంట్లను ప్రకటించింది. ఇవాళ్టి నుంచి (జూన్ 10) ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈనెల 14 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రముఖ బ్రాండ్ల ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.
ఈ జాబితాలో ఆపిల్, శాంసంగ్, పోకో సహా మరెన్నో బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. పలు బ్రాండ్ల ఫోన్లపై ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించింది. దీంతో అత్యంత తక్కువ ధరకే మీకు నచ్చిన ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. HDFC, కోటక్ బ్యాంక్ కార్డులు కలిగిన వారు 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Poco X5 5G ఫోన్ భారత్‌లో ధర రూ.18,999కు లాంచ్ అయింది. ఈ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ ధర రూ.15,999కు అందుబాటులో ఉంది. దీంతో పాటు HDFC బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన వారు అదనంగా 1000 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌ను కేవలం రూ.14,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే కంపెనీ లాంచ్ చేసిన ధరతో పోలిస్తే సుమారు 4 వేల రూపాయల డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ఐఫోన్ 13 ధర రూ.69,900కు అందుబాటులో ఉంది. అదే బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే కేవలం 58,749 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. అంటే సుమారు రూ.11,151 ఆదా చేయవచ్చు. SBI క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే సుమారు 750 రూపాయల వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ ఈ సంవత్సరం మార్చిలో విడుదల అయింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.13,499కే సొంతం చేసుకోవచ్చు. మరియు శాంసంగ్ గెలాక్సీ F13 ఫోన్‌ను ధర రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు. మరియు శాంసంగ్ గెలాక్సీ M14 ఫోన్‌ను అత్యంత తక్కువ ధర రూ.14,327కు సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ Moto G62 స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,499 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ ఆఫర్‌లో భాగంగా రూ.14,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ 5G ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. వీటితో పాటు నథింగ్ ఫోన్1, గూగుల్ పిక్సల్ 6a, మోటోరోలా ఎడ్జ్ 40 సహా మరెన్నో స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








