Flipkart Big Saving Days Sale: స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్...
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ జూన్ నెలలో మరొక సేల్ తో వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో రాబోయే అమ్మకాలు జూన్ 13 ఆదివారం మొదలయ్యి జూన్ 16 వరకు కొనసాగనున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం జూన్ 12 అర్ధరాత్రి నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ నాలుగు రోజుల అమ్మకంలో వివిధ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ధరించగలిగిన గాడ్జెట్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై గొప్ప ఆఫర్‌లు, మరియు డిస్కౌంట్‌లను అందివ్వనున్నది.

ఫ్లిప్‌కార్ట్ యొక్క ఈ అమ్మకంలో ఎస్‌బిఐ కార్డ్ వినియోగదారులకు 10 శాతం వరకు తక్షణ తగ్గింపును అందిస్తుంది. ఆఫర్ల విషయానికొస్తే గూగుల్ పిక్సెల్ 4a, ఐఫోన్ 11 ప్రో, మోటరోలా రజర్ 5G, శామ్సంగ్ గెలాక్సీ F12, మరియు ఆసుస్ ROG ఫోన్3 వంటి స్మార్ట్‌ఫోన్ మోడళ్లను డిస్కౌంట్ ధర వద్ద పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ రాబోయే స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్కువగా దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన మైక్రోసైట్ కొన్ని అనుబంధ ఒప్పందాలను వెల్లడించనున్నది. ఆ మోడళ్లలో ROGఫోన్ 3 ఉంది. ఇది ఇప్పుడు రూ.41,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. సాధారణంగా దీని యొక్క ప్రస్తుత ప్రారంభ ధర రూ.46,999. అలాగే ప్రస్తుతం రూ.10,999 ధర వద్ద లభించే శామ్‌సంగ్ గెలాక్సీ F12 ని కూడా సేల్ సమయంలో రూ.9,999 తగ్గింపుతో పొందవచ్చు.

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ యొక్క సేల్ లో సాధారణంగా రూ.36,100 ధర వద్ద లభించే గూగుల్ పిక్సెల్ 4A ను రూ. 26,999 మరియు రూ.29,999 ధరల వద్ద పొందవచ్చు. అలాగే ఐక్యూ 3ను రూ. 24,990 ప్రారంభ ధర వద్ద పొందవచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.34,990 ధర వద్ద లభిస్తున్నది. రూ.109,999 ధర వద్ద లభించే మోటరోలా రాజర్ 5G ను కూడా ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో రూ.89,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. జియోనీ మాక్స్ ప్రో, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5, మరియు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 వంటి సరసమైన ఫోన్‌లపై కూడా ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఉంటుంది. రెడ్‌మి నోట్ 9 తో సహా మోడళ్లపై ప్రీపెయిడ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది.

ఐఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో ఐఫోన్ ప్రియుల కోసం కూడా ఐఫోన్ కొనుగోలు మీద అద్భుతమైన తగ్గింపు ఆఫర్లు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో ఐఫోన్ 11 ప్రో ను రూ.74,999 ధర వద్ద పొందవచ్చు. సాధారణంగా దీని యొక్క ధర రూ.79,999. అలాగే ఐఫోన్ XR ను కూడా రూ.39,999 ధర వద్ద పొందవచ్చు. దీని యొక్క సాధారణ ధర రూ.41,999. ఐఫోన్ SE(2020) ను కూడా రూ.31,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు.

ఇతర గాడ్జెట్‌లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్స్
స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్ అమ్మకం సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాటి ఉపకరణాలపై 80 శాతం తగ్గింపును అందిస్తుంది. స్మార్ట్‌వాచ్‌లపై 60 శాతం వరకు, టాబ్లెట్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తుంది. వీటితో పాటుగా డెస్క్‌టాప్ PCలు, ల్యాప్‌టాప్‌లపై 30 శాతం వరకు తగ్గింపు ఉంటుందని వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ దిగ్గజం మైక్రోసైట్‌లో తెలిపింది. ఈ అమ్మకం టెలివిజన్లలో 70 శాతం తగ్గింపును తెస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ క్రేజీ డీల్స్
ఫ్లిప్‌కార్ట్ యొక్క రానున్న అమ్మకంలో నిర్దిష్ట సమయాలలో ‘క్రేజీ డీల్స్' ను నిర్వహించనున్నది. ఉదయం 12, 8, మరియు సాయంత్రం 4 గంటలకు సేల్ అంతటా హోస్ట్ చేస్తుంది. ఇవి పరిమిత కాలానికి ఎంపిక చేసిన ఆఫర్‌లను కలిగి ఉంటాయి. పైన చెప్పినట్లుగా SBI క్రెడిట్ కార్డ్ మరియు ఇఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంటుంది.


Click it and Unblock the Notifications