Home
News

Flipkart బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. 50 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్లు..!!

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌లను ప్రకటించాయి. అమెజాన్‌ ప్రైమ్‌ డే పేరుతో జులై 15 12AM నుంచి జులై 16 12AM వరకు సేల్‌ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో కేవలం ప్రైమ్‌ మెంబర్లు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉంది. అయితే భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం ఉంది.

అదే మరో దిగ్గజం Flipkart కూడా బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. జులై 15 నుంచి 19 వరకు సేల్‌ కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఫర్నిచర్‌పై సుమారు 80 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.

Flipkart Big saving days sale

అదే విధంగా టీవీలు, వాషింగ్‌ మెషిన్‌, ఫ్రిడ్జ్‌, కూలర్‌, ఫ్యాన్‌ సహా ఇతర ఉత్పత్తులపై 75 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ ఒరిజినల్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా యాక్సె్స్‌ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు 24 నెలల నోకాస్ట్‌ EMI సదుపాయం, మరియు ఎక్స్చేంజ్‌ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది.

ఫ్లిప్‌కార్డు బిగ్‌ సేవింగ్‌ డేస్‌లో భాగంగా ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 4 గంటలకు అత్యుత్తమ ఆఫర్లు ఉంటాయని తెలిపింది. ఉత్తమ బ్రాండ్ల ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై అత్యధిక డిస్కౌంట్లు లభిస్తాయని తెలుస్తోంది. వీటితోపాటు వివో, రియల్‌మీ, పోకో సహా ఇతర బ్రాండ్ల ఫోన్ల ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌పై మరిన్ని డిస్కౌంట్లు ఆశించవచ్చు.

మే నెలలో ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన సేల్‌లో ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్లు అందించింది. ఈసారి కూడా ఐఫోన్‌ సీరిస్‌పై మంచి ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆపిల్‌ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం 128GB అంతర్గత స్టోరేజీ కలిగిన ఐఫోన్‌ 14 స్మార్ట్‌ఫోన్ ధర ప్రసుత్తం రూ.79,900గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ 11 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. దాంతో ఐఫోన్‌ 14 రూ.70,999కే కొనుగోలు చేయవచ్చు.

అయితే ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 14పై మరింత డిస్కౌంట్ లభించనున్నట్లు తెలిసింది. దీంతో ఈ ఫోన్‌ కేవలం 60 వేల నుంచి 65 వేల ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లుతో ఈ ఫోన్‌ మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

*అమెజాన్ సేల్‌లో మోటొరోలా రేజర్‌ 40 అల్ట్రా, ఐపోన్‌ 14, ఐక్యూ నియో 7 ప్రో సహా మరిన్ని ఫోన్లపై ఆఫర్లు ఇస్తున్నట్లు చెప్పింది. అమెజాన్ సేల్ కేవలం 48 గంటలపాటు మాత్రమే లైవ్‌లో ఉంటుంది. ఈ సేల్‌కు అమెజాన్‌ కొన్ని 5G ఫోన్ల ధరలను టీజ్‌ చేసింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big saving days sale will launch from july 15 to 19 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X