Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ మొదలు కానున్నాయి!!! రూ.1తో ప్రీ-బుక్ చేసుకునే అవకాశం!!!
ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ మొదలుకానున్నాయి. సెప్టెంబర్ 18 మరియు సెప్టెంబర్ 20 రెండు రోజుల మధ్య జరిగే ఈ అమ్మకంలో అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలో జరిగే ఈ అమ్మకంలో మొబైల్లు, టాబ్లెట్లు, టీవీలు మరియు వాటి యొక్క ఉపకరణాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద అనేక డిస్కౌంట్లు మరియు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ లో జరగబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ సమయంలో కస్టమర్లు కొనుగోలు చేయదలిచిన వాటిని ముందుగా కేవలం ఒక రూపాయి చెల్లించి బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ ప్రీ-బుక్ ఆఫర్ సెప్టెంబర్ 15 మరియు సెప్టెంబర్ 16 మధ్య లభిస్తుంది. SBI కార్డ్ వినియోగదారులకు అద్భుతమైన EMI ఆఫర్లను అందిస్తున్నది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు
ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ సేవింగ్ డేస్‌లో విక్రయించబోయే ఉత్పత్తుల వివరాలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా విడుదల చేయలేదు. కానీ మొబైల్ ఫోన్లు మరియు టాబ్లెట్‌లను కొనడానికి ఆసక్తి ఉన్న కస్టమర్లకు నో-కాస్ట్ EMI ఆఫర్లు మరియు కార్డ్‌లెస్ క్రెడిట్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తున్నది. టీవీలు మరియు గృహోపకరణాలపై ఆసక్తి ఉన్న కస్టమర్లకు ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ఒక అద్భుతమైన అవకాశంగా ఉంది.

ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద తగ్గింపు ఆఫర్లు
నో-కాస్ట్ EMI మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో దాదాపుగా మూడు కోట్లకు పైగా ఎలక్ట్రానిక్స్ మరియు వాటి యొక్క ఉపకరణాలను అమ్మకానికి ఉంచింది. ఇందులో ముఖ్యంగా వైర్‌లెస్ మౌస్లు, కీబోర్డులు, పవర్ బ్యాంకులు,పవర్ కేబుల్స్, హెడ్‌ఫోన్‌లు వంటి మరిన్ని స్మార్ట్‌బ్యూ ఉత్పత్తులను ఆకర్షణీయమైన తగ్గింపులతో పొందే అవకాశం ఉంది. అలాగే SBI కార్డ్ వినియోగదారుల యొక్క లావాదేవీల మీద 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌ల మీద తగ్గింపు ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ మునుపటి బిగ్ సేవింగ్ డేస్ సేల్ గత నెల ప్రారంభంలో జరిగింది. ఇందులో ఐఫోన్ XR రూ. 44,999, ఐఫోన్ XE రూ. 36,999, ఒప్పో రెనో 2 రూ.10,000 తక్షణ డిస్కౌంట్లతో అందించింది. ఇప్పుడు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను అందివ్వనున్నది. షియోమి సంస్థ కొత్తగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లు రెడ్ మి 9A, 9 మరియు 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క మొదటి అమ్మకాలు కూడా ఈ సేల్ లో మొదలుకానున్నాయి. అలాగే ఆపిల్ హోమ్‌పాడ్ (రూ .18,900), గూగుల్ హోమ్ మినీ (రూ.2,299) లను కూడా రాయితీ ధరలకు కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశం అందిస్తున్నది.

ల్యాప్‌టాప్‌ల మీద డిస్కౌంట్ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ మునుపటి బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా ల్యాప్‌టాప్‌లు మరియు వాటి యొక్క ఉపకరణాల మీద గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో కొన్ని ఏసర్ ల్యాప్‌టాప్‌లు, వైర్‌లెస్ స్పీకర్లు మరియు వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను తగ్గింపు ధరల వద్ద అందిస్తున్నాయి.


Click it and Unblock the Notifications