ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్: ఈ స్మార్ట్‌ఫోన్ లపై రూ.6000 వరకు డిస్కౌంట్...

|

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో జూలై నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ పేరుతో మరొకసారి వినియోగదారులను పలకరించడానికి ముందుకు వస్తున్నది. జూలై 25 నుంచి 5 రోజుల పాటు నిర్వహించే ఈ అమ్మకంలో ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన కొన్ని గాడ్జెట్‌లపై అధిక డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తుంది. ముఖ్యంగా మీరు క్రొత్త స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడం కోసం చూస్తున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021 షాపింగ్ చేయడానికి ఉత్తమంగా ఉంది. ఉదాహరణకు ఈ అమ్మకంలో మోటో రేజర్, పోకో X3 ప్రో వంటి మరిన్నింటిపై భారీ ధరల తగ్గింపును అందిస్తోంది.

 
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ సేల్:ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ.6000 డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021: పోకో X3 ప్రో పై రూ.6000 డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ 2021 అమ్మకంలో పోకో X3 ప్రోపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ మోడల్‌పై సుమారు రూ.6,000 తగ్గింపును అందిస్తున్నది. అంటే దీనిని ఈ అమ్మకంలో కేవలం రూ.18,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. స్నాప్‌డ్రాగన్ 860 చిప్‌సెట్, ఎఫ్‌హెచ్‌డి + డిస్‌ప్లే మరియు క్వాడ్-కెమెరా సెటప్‌ మరియు 5,160 mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉన్న పోకో ఎక్స్ 3 ప్రో అద్భుతమైన పనితీరును కలిగి ఉంది.

ఐఫోన్ SE, ఐఫోన్ XR మరియు ఐఫోన్ 12 పై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్

జాబితాలో తదుపరి అనేక ఐఫోన్ మోడళ్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021 ఐఫోన్ SE, ఐఫోన్ XR మరియు సరికొత్త ఐఫోన్ 12 లపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు కలిగి ఉన్నాయి. ఈ అమ్మకంలో ఐఫోన్ SE 2020 ను కేవలం రూ.28,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే ఐఫోన్ XR ను కేవలం రూ.37,999 ధర వద్ద మరియు ఐఫోన్ 12 ను రూ.67,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటుగా బ్యాంక్ యొక్క డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మైక్రోమాక్స్ IN 1 లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డిస్కౌంట్ ఆఫర్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ 2021 సేల్ లో భారీ డిస్కౌంట్ ధర వద్ద లభిస్తున్న మరొక స్మార్ట్‌ఫోన్‌ మైక్రోమాక్స్ IN 1. ఇక్కడ కొనుగోలుదారులు మేడ్-ఇన్-ఇండియా మైక్రోమాక్స్ IN 1 స్మార్ట్‌ఫోన్‌ను జూలై 25 న కేవలం రూ.9,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ విభాగంలో ఇది విలువైన ఆఫర్ గా ఉంది.

మోటరోలా రేజర్‌పై ఫ్లిప్‌కార్ట్ యొక్క ఉత్తమ ఆఫర్

జాబితాలో ఉన్న మరో ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్ మోటరోలా రేజర్. ప్రత్యేకమైన ఫ్లిప్ డిజైన్ మరియు ప్రధాన ఫీచర్లను కలిగిఉన్న మోటరోలా రేజర్ ప్రతి ఒక్కరి డ్రీమ్ ఫోన్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021 లో ఈ ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌ను 63 శాతం తగ్గింపుతో కేవలం రూ.54,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Big Savings Days Sale 2021: Discount Offers on Motorola Razr Poco x3 Pro, iphone 12 and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X