ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ 2019: ఆఫర్స్ ఒకసారి చూసేయండి
ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ 2019 మరోసారి అందుబాటులోకి రానున్నది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఈ సేల్స్ యొక్క తేదీలను ప్రకటించింది. ఈ సేల్స్ ప్రారంభానికి ముందే ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్‌ల వివరాలను వెళ్ళడించింది. ఫ్లిప్‌కార్ట్ యొక్క ఈ సేల్ లో అనేక రకాల స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు మరియు ల్యాప్‌టాప్‌లపై ధర తగ్గింపులు మరియు డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ షాపింగ్ డేస్ సేల్ డిసెంబర్ 1 ఆదివారం నుండి మొదలై డిసెంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ సేల్స్ లో రియల్‌మి 5, శామ్‌సంగ్ గెలాక్సీ S9 మరియు ఆపిల్ ఐఫోన్ 7 లను గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ధరలకు అందిస్తున్నది. అలాగే టివిలు మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.

ల్యాప్‌టాప్‌లు మరియు కెమెరాలపై 80 శాతం తగ్గింపును అందిస్తున్నది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ అమ్మకంలో ఫ్యాషన్ ఉత్పత్తులపై 60% డిస్కౌంట్ అందిసున్నది. అలాగే వంటింటి వస్తువులను కేవలం రూ.99లకే అందిస్తున్నది. ఈ అమ్మకంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క కార్డుల మీద కొనుగోలు చేసిన వారికీ 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తారు. EMI లావాదేవీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ విడుదల చేసిన మైక్రోసైట్ ప్రకారం బిగ్ షాపింగ్ డేస్ సేల్ డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 5 మధ్య జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు నవంబర్ 30 శనివారం రాత్రి 8 గంటల నుండి అమ్మకాలకు ముందస్తు యాక్సిస్ లభిస్తుంది.

మొబైల్ ఫోన్ల మీద ఆఫర్స్
మొబైల్ ఫోన్ల మీద అందిస్తున్న ప్రధాన ఆఫర్‌ల విషయానికొస్తే ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో రియల్‌మి 5, రియల్‌మి X, శామ్‌సంగ్ గెలాక్సీ S9, శామ్‌సంగ్ గెలాక్సీ S9 +, గూగుల్ పిక్సెల్ 3A , ఆపిల్ ఐఫోన్ 7, మరియు ఆసుస్ 5 జెడ్ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపును అందిస్తున్నది.

ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు ఆఫర్స్
మొబైల్ ఫోన్ ఆఫర్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్ సేల్స్ లో టీవీలు మరియు గృహోపకరణాలపై 75 శాతం తగ్గింపుతో పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్స్ మరియు ఫుల్ ప్రొటెక్షన్ను అందిస్తుంది. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు తగ్గింపు, డిఎస్‌ఎల్‌ఆర్‌లు మరియు డిజిటల్ కెమెరాలపై రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, బోట్ మరియు జెబిఎల్ వంటి బ్రాండ్ల యొక్క హెడ్‌ఫోన్‌లు మరియు స్పీకర్లపై 70 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నాయి. వాటి యొక్క దరల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ ను చూడవచ్చు.

బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ "బ్లాక్ బస్టర్ డీల్స్" మరియు కొత్త ఆఫర్‌లను ఉదయం 12AM , ఉదయం 8AM మరియు సాయంత్రం 4PM గంటలకు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా తెల్లవారుజాము 2 గంటల వరకు "రష్ అవర్స్" ద్వారా తగ్గింపు ధరలతో గొప్ప ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








