సంచలన ఆఫర్లతో దూసుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి డిస్కౌంట్‌లతో మెరవబోతోంది. హాలీడే సీజన్‌ను పురస్కరించకుని డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 21 వరకు ప్రత్యేక ఆఫర్లతో కూడిన బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను నిర్వహించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ షాపింగ్ పండుగలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్ అలానే ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ అందించనుంది.

Read More : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో, సొంతంగా లాక్ స్ర్కీన్ క్రియేట్ చేసుకోవటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎస్‌బీఐ యూజర్లకు 10శాతం డిస్కౌంట్..

ఈ షాపింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రకటించింది.

Win-Win ఆఫర్‌..

ఈ సేల్‌ను పురస్కరించుకుని Win-Win పేరుతో ప్రత్యేకమైన ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్‌కు ఎంపికైన యూజర్, వెబ్‌సైట్‌లో ఉచితంగా షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

10 మందికి హాలీడే డే ట్రిప్‌..

ఎంపిక కాబడిన 10 మంది యూజర్లు యూరోప్, శ్రీలంక, అండమాన్, మారిషస్ ఇంకా హిమాచల్‌ప్రదేశ్‌లలో హాలీడే డే ట్రిప్‌ను ఎంజాయ్ చేసే వీలుంటుంది.

మోటో ఇ3, సామ్‌సంగ్ గేర్ ఫిట్ 2, Vu TVల పై డిస్కౌంట్స్...

ఈ షాపింగ్ డేస్ సేల్‌లో భాగంగా మోటో ఇ3, సామ్‌సంగ్ గేర్ ఫిట్ 2, Vu TV
స్మార్ట్‌‌టీవీల పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్‌లను కూడా ఫ్లిఫ్‌కార్ట్ స్పెషల్ ఆఫర్ల పై విక్రయించనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart's Big Shopping Days Sale to Begin on December 18. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot