ఫిదా అయ్యే ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్స్

|

ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ షాపింగ్ డేస్ సేల్‌తో వస్తున్నట్లు ప్రకటించింది. ఈ అమ్మకం జూలై 15 నుండి జూలై 18 వరకు జరుగుతుంది. ఈ సేల్స్ లో భాగంగా SBI క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా వైవిధ్యమైన ఉత్పత్తులపై 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ SBI బ్యాంక్ తో ఒప్పందం కలిగి ఉంది.

ఫిదా అయ్యే ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్స్

 

జూలై 15 న ఉదయం 8 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ముందస్తు యాక్సిస్ లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. అమ్మకం సమయంలో టీవీలు మరియు వాటి ఉపకరణాల మీద 75 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. ఇవే కాకుండా ఫ్యాషన్ కేటగిరీ మీద 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. వీటితో పాటు మొబైల్ ఫోన్ల మీద కూడా చాలా రకమైన ఒప్పందాలు ఉంటాయి.

 మొబైల్స్ ఆఫర్స్:

మొబైల్స్ ఆఫర్స్:

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో రియల్‌మి మొబైల్స్ 7,499రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. నోకియా 5.1 ప్లస్ కూడా 9,999రూపాయల డిస్కౌంట్ ధర వద్ద లభిస్తుంది. పోకో F1, ఇన్ఫినిక్స్ నోట్ 5, మరియు వివోV9 ప్రో కూడా చాలా రకాల ఒప్పందాలతో జాబితా చేయబడతాయి.2000రూపాయల అదనపు ఎక్స్చేంజ్ తగ్గింపుతో వివోV 11 ప్రో, వివో V11 , ఒప్పో F9 ప్రో వంటి ఫోన్‌లు కూడా ఆఫర్ చేయనున్నారు.

టాబ్లెట్ ఆఫర్స్:

టాబ్లెట్ ఆఫర్స్:

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ సందర్భంగా టాబ్లెట్ ఒప్పందాలలో లెనోవా మరియు ఆల్కాటెల్ టాబ్లెట్‌లు 6,999రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవే కాకుండా శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ A 12.999రూపాయల వద్ద లభిస్తుంది . ఫోన్ కొనుగోళ్లతో పాటు కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ కేవలం 99రూపాయలకు అందిస్తున్నారు.

హోమ్ అప్లికేషన్ ఆఫర్స్:
 

హోమ్ అప్లికేషన్ ఆఫర్స్:

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో భాగంగా టీవీలు మరియు వాటి అనుబంధాల మీద గొప్ప ఒప్పందాలు మరియు డిస్కౌంట్‌లతో 65 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.రూ.275 నుండి రూ.6,790 వరకు గల అన్ని గృహోపకరణాలు మరియు రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషీన్ల మీద 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

ఫ్యాషన్ విభాగంలో ఆఫర్స్:

ఫ్యాషన్ విభాగంలో ఆఫర్స్:

ఫ్యాషన్ విభాగంలో బూట్లు మరియు చెప్పుల మీద 40 నుండి 80 శాతం వరకు, వాచీలు మరియు బ్యాగులు మీద 80 శాతం వరకు, షర్టులు మరియు జీన్స్ ఫాంట్ల మీద 50 నుండి 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ సమయంలో హ్యాండ్‌బ్యాగులు కేవలం 999రూపాయలకు దిగువన లభిస్తున్నాయి.

బ్యూటీ అండ్ బేబీ కేర్ ఆఫర్స్:

బ్యూటీ అండ్ బేబీ కేర్ ఆఫర్స్:

బ్యూటీ అండ్ బేబీ కేర్ విభాగంలో డిస్కౌంట్లు మరియు డీల్స్ లో భాగంగా 99రూపాయల నుంచి మొదలవుతున్నాయి. బ్యూటీ అండ్ గ్రూమింగ్ విభాగంలో 70 శాతం వరకు, బొమ్మల మీద 80 శాతం వరకు, ట్రెడ్‌మిల్‌లు 10,999రూపాయల నుంచి మొదలవుతాయి, ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ సందర్భంగా బేబీ కేర్ విభాగం 99రూపాయల నుంచి మొదలవుతుంది. ఇంటికి సంబందించిన వస్తువులు మరియు ఫర్నిచర్ వస్తువులను కొనాలని చూస్తున్న వారందరికీ 40 నుండి 80 శాతం వరకు మినహాయింపుతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్స్ అందుబాటులో వస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
flipkart big shopping days sale july 15 18

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X