ఫ్లిప్‌కార్ట్ సేల్, ఈ రెండు ఫోన్లపైన ఖచ్చితమైన తగ్గింపు

Written By:

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి భారీ ఆఫర్లు ప్రకటించింది. మే 13నుంచి బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ పేరుతో నాలుగు రోజుల పాటు వివిధ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్‌, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లపై డిస్కౌంట్‌ను ఇవ్వనుంది. ఇందులో భాగంగా గూగుల్‌ పిక్సెల్‌ 2, పిక్సెల్‌2 ఎక్స్‌ఎల్‌ ధరలను భారీగా తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ఉన్నవారు వివిధ వస్తువుల కొనుగోలుపై 10శాతం రాయితీ పొందవచ్చు. ఇంకా ఇతర రకాల ఉత్పత్తులపై కూడా భారీ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతానికి తగ్గింపు పొందే ఫోన్ల వివరాలు ఇవే.

రూ. 14 వేలకే ఆకట్టుకునే ల్యాప్‌టాప్, మంచి అవకాశం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్‌ పిక్సెల్‌

గూగుల్‌ పిక్సెల్‌ ధర సుమారు రూ.50వేలు ఉండగా, బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌లో రూ.34,999లకే సొంతం చేసుకోవచ్చు.

గూగుల్ పిక్సెల్ ఫీచర్లు
5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎమోలెడ్ డిస్ప్లే
గొరిల్లా గ్లాస్ 4 రక్షణ
2.15 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ (64 బిట్)
4 ర్యామ్
32జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (రెండు వేరియంట్లు)
12.3ఎంపీ వెనుక కెమెరా, 8ఎంపీ ముందు కెమెరా
2,770 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ
ఫింగర్ ప్రింట్ స్కానర్
గూగుల్ పిక్సెల్ ఎక్స్‌ఎల్ ఫీచర్లు
5.5 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ అమోలెడ్ డిస్ప్లే
గొరిల్లా గ్లాస్ 4 రక్షణ
2.15 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ (64 బిట్)
4 ర్యామ్
32జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (రెండు వేరియంట్లు)
12.3ఎంపీ వెనుక కెమెరా, 8ఎంపీ ముందు కెమెరా
3,450 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ
ఫింగర్ ప్రింట్ స్కానర్

శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌

రూ.17,900 ఉన్న శాంసంగ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు
5.5 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 617 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్నల్ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్, 13 ఎంపీ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మొబైళ్ల ఆఫర్లు..

వీటితో పాటు అనేక మొబైళ్ల ఆఫర్లు కొనసాగుతాయని ఫ్లిప్‌కార్ట్‌ స్పష్టం చేసింది. ఇక గేమింగ్‌ లాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌ యాక్ససరీలపై 75శాతం వరకూ రాయితీని ఇస్తోంది. పవర్‌ బ్యాంకులు రూ.499కే లభించనున్నాయి.

మే 15న హానర్‌ 10

మరోపక్క మే 15న హానర్‌ 10ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్‌ చేయనున్నారు. ఇది కూడా ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆఫర్లతో కూడిన అమ్మకాలు జరిగే అవకాశం ఉంది.

హానర్ 10 ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

టెలివిజన్‌లు, ఫర్నీచర్‌, గృహలంకరణ వస్తువులపై..

వీటితో పాటు దుస్తులు, చెప్పులు, గృహోపకరణాలు, టెలివిజన్‌లు, ఫర్నీచర్‌, గృహలంకరణ వస్తువులపై కూడా పలు ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటు ఈసారి ప్రత్యేకంగా గేమ్స్‌ కార్నర్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించింది.

రూ.1కే ల్యాప్‌టాప్‌, మొబైళ్లను..

ఇదిలా ఉంటే flipkart big shopping days saleలో భాగంగా రూ.1కే ల్యాప్‌టాప్‌, మొబైళ్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాదు, 100శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఇందుకు షరతులు వర్తిస్తాయని ఫ్లిప్‌కార్ట్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Sale Promises Price Drops on Pixel 2 XL, Samsung Galaxy On Nxt, and More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot