Home
News

రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్ ఉత్సవ్‌ 2024 సేల్‌.. ఈ ఉత్పత్తులపై గరిష్ఠంగా 80 శాతం డిస్కౌంట్‌లు..!!

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ మరో సేల్‌తో సిద్ధం అవుతోంది. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2024 పేరుతో సేల్‌ నిర్వహించింది. రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్ ఉత్సవ్‌ 2024 సేల్‌ను (Flipkart Big Shopping Utsav 2024 sale) ప్రారంభించనుంది. ఈ సేల్‌లో ఉత్పత్తులు సహా వివిధ బ్రాండ్‌ల ఉత్పత్తులపై డిస్కౌంట్‌ల వివరాలను వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా అనేక గ్యాడ్జెట్‌లు సహా గృహోపకరణాలపై డిస్కౌంట్‌లను కలిగి ఉంటాయి. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌లను పొందవచ్చు.

ఫ్లి్‌ప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా బిగ్‌ షాపింగ్‌ ఉత్సవ్‌ 2024 సేల్‌ రేపటి నుంచి (అక్టోబర్‌ 9) నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 13 వరకు సేల్‌ జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా యాక్సెస్‌ బ్యాంక్‌, BOB కార్డు, RBL, యెస్‌ బ్యాంక్‌ కార్డుల ద్వారా 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

Flipkart Big Shopping Utsav 2024 sale dates

దీంతోపాటు ఈ సేల్‌లో భాగంగా నోకాస్ట్‌ EMI, రూ.1 లక్ష వరకు క్రెడిట్‌ తీసుకోవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్‌ పేలేటర్‌ పేమెంట్‌ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ ఉత్సవ్‌ సేల్‌ ఆఫర్లను సంస్థ విడుదల చేసింది. అనేక ప్రముఖ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లను ఈ సేల్‌ భాగంగా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా వాషింగ్ మెషిన్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్‌లను ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ షాపింగ్‌ ఉత్సవ్‌ 2024 సేల్‌లో గరిష్ఠంగా 80 శాతం డిస్కౌంట్‌లను పొందవచ్చని తెలుస్తోంది. అయితే ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్‌ వివరాలను వెల్లడి కావాల్సి ఉంది.

Flipkart Big Shopping Utsav 2024 sale dates

ఆపిల్‌, శాంసంగ్, మోటోరోలా, వివో సహా మరిన్ని స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, శాంసంగ్‌ గెలాక్సీ S23, గెలాక్సీ S24+, గూగుల్‌ పిక్సల్‌ 8, నథింగ్‌ ఫోన్‌ 2a, CMF ఫోన్‌ 1, ఒప్పో K12x 5G స్మార్ట్‌ఫోన్‌లు సహా అనేక మోడళ్లు తగ్గింపు ధరలకు కలిగి ఉంటాయని తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ షాపింగ్‌ ఉత్సవ్‌ 2024 సేల్‌లో భాగంగా CMF ఫోన్ 1.. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.12499 కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. విడుదల సమయంలో 6GB ర్యామ్‌ వేరియంట్ ధర రూ.15999 గా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 నథింగ్‌ OS 2.6 పైన పనిచేస్తుంది. 50MP, 2MP కెమెరాను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో పనిచేస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Big Shopping Utsav 2024 sale to start from october 9th 2024 sale deals teased
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X