Google Pixel స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఆఫర్ ఎప్పటి వరకు ఉందంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఈ సంవత్సరం అక్టోబర్‌లో గూగుల్ పిక్సల్ 8 ప్రో (Google Pixel 7 Pro) స్మా్ర్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర సుమారు 1 లక్ష రూపాయలుగా ఉంది. అయితే తాజాగా పిక్సల్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ల ధర భారీగా తగ్గింది. అది కూడా ఎటువంటి బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఆఫర్లు లేకుండా తగ్గింపు ధరను పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌లో (Flipkart Big year End Sale) భాగంగా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అయితే పిక్సల్ 7 ప్రో ఆఫర్ ఈ రాత్రి వరకు వర్తిస్తుంది. ఈ ఫోన్ హాజల్, ఒబ్సిడియన్, స్నో రంగుల్లో అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సల్ 7 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్, 128GB స్టోరేజీ ధర రూ.60,999గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా రూ.2000 వరకు తగ్గింపును పొందవచ్చు. రూ.699కే 12 నెలల Spotify ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై రూ.38,500 వరకు ఎక్స్చేంజీ ఆఫర్ ద్వారా పొందవచ్చు.
గూగుల్ పిక్సల్ 7 ప్రో స్పెసిఫికేషన్లు : పిక్సల్ 7 ప్రో 6.7 అంగుళాల QHD+ OLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz డిస్‌ప్లే రీప్రెష్ రేట్‌తో వస్తుంది. 1500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సార్ G2 ప్రాసెసర్ మరియు టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OSపై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 OSను కూడా సపోర్టు చేస్తుంది.
మరియు గూగుల్ పిక్సల్ 7 ప్రో 23W వైరడ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 48MP 5X టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 10.8 సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.
కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వైఫై 6, బ్లూటూత్ 5.2, NFC, USB-C ఛార్జింగ్ పోర్టుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం ఇన్ స్క్రీన్ ఫింగర్ ఫ్రింట్ రీడర్‌ను కలిగి ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ IP68 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పైన ఉన్న ఆఫర్ ఈ రాత్రితో ముగుస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








