ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ +...24గంటల్లో అవుట్ ఆఫ్ స్టాక్!

Posted By: Madhavi Lagishetty

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే బిలియన్ క్యాప్చర్ ప్లస్ పేరుతో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తన బ్రాండ్ నుంచి మొదటిసారిగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ డివైస్ను రెండు వేరియంట్లో ప్రారంభించారు. 32జిబి స్టోరేజితో 10,999రూపాయలకు ఒకటి, మరొకటి 64జిబి స్టోరేజితో 12,999రూపాయలకు యూజర్లకు మార్కెట్లో అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ +...24గంటల్లో అవుట్ ఆఫ్ స్టాక్!

ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ + ఇది స్మార్ట్రన్ డిజైన్తో ఇంజనీరింగ్ చేయబడింది. ఆన్‌లైన్‌ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా నవంబరు 15న మొట్టమొదటిసారిగా అమ్మకాలు జరిగాయి. మొదటి 24గంటల్లో స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని యూనిట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని కంపెనీ ప్రకటించింది. అయితే ఎన్ని యూనిట్లు విక్రయించారన్నవిషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

మీరు ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ + స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఫస్ట్ అమ్మకాన్ని కోల్పోరు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌ యొక్క రెండవ అమ్మకం నవంబర్ 20 నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లభిస్తాయి. EMI చెల్లింపులకు ఎలాంటి పేమెంట్స్ చేయాల్సి అవసరం లేదు. లాంచింగ్ ఆఫర్లలో భాగంగా ఐడియా సెల్యూలార్ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం 60జిబి ఫ్రీ 4జి డేటాను అందిస్తోంది. కొనుగోలుదారులు 10రైడ్ ఓలా షేర్ పాస్ను 249రూపాయలు ఉచితంగా పొందవచ్చు.

ఇంటెక్స్ నుంచి మరో రెండు బడ్జెట్ ఫోన్లు

బిలియన్ క్యాప్చర్ + స్మార్ట్‌ఫోన్‌ గురించి చర్చిస్తే...డివైస్ దాని బ్యాక్ ఉన్న LED ఫ్లాష్ తో ఎగువ లెఫ్ట్ కార్నర్లో హారిజాంటల్ పొజిషన్లో బ్యాక్ ఒక మెటల్ unibody డిజైన్ మరియు డ్యుయల్ కెమెరాలు ఉంటాయి.

ఇక స్పెక్స్ చూసినట్లయితే... స్మార్ట్‌ఫోన్‌ 5.5అంగుళాల ఫుల్ హెచ్డి 1080పిక్సెల్స్ డిస్ల్పేను 2.5డిగ్రీల క్వార్డ్ గ్లాస్ తో ఉంటుంది. ఆక్టాకోర్ స్నాప్ డ్రాగెన్ 625 soc 3జిబి, 4జిబి ర్యామ్ మరియు 32జిబి ,64జిబి స్టోరేజి స్పేస్ను కలిగి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిలియన్ క్యాప్చర్ యొక్క ఇమేజింగ్ యాస్పెక్స్ డ్యుయల్ మోడ్ మరియు సూపర్ నైట్ మోడ్తో బ్యాక్ సైడ్ 13మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరాలు ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

ఇక 3500ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు క్విక్ ఛార్జ్ ఫీచర్ సపోర్టు ఉంటుంది. ఈ బ్యాటరీ ఒకే ఛార్జ్ తో రెండు రోజుల వరకు ఉంటుంది. 4జి వోల్ట్ , బ్లూటూత్, వై-ఫై,యుఎస్బి టైప్-సి పోర్ట్, డ్యుయల్ సిమ్ సపోర్టు వంటి కనెక్టివిటీ కారకాలను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ తో రన్ అవుతుంది. 7.1.2నౌగట్ మరియు త్వరలోనే ఆండ్రాయిడ్ ఓరెయో అప్ డేట్ను అందుకోనుంది.

Read more about:
English summary
Flipkart Billion Capture+ smartphone that went on sale on November 15 has gone out of stock in just 24 hours.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot