Home
News

ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్ ఫ్రైడే సేల్‌ 2025.. ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే..?

భారత్‌లో దసరా, దీపావళి సమయాల్లో ఇ-కామర్స్‌ సంస్థలు అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్రత్యేక సేల్‌ నిర్వహించాయి. దీంతోపాటు అనేక బ్రాండ్స్‌ కూడా ప్రత్యేక ఆఫర్లను అందించాయి, అయితే ఫ్లిప్‌కార్ట్‌ త్వరలో మరో సేల్‌ ను ప్రారంభించనుంది. బ్లాక్‌ ఫైడే సేల్‌ 2025 ( Flipkart Black Friday Sale 2025 ) తేదీ సహా ఇతర ఆఫర్లు, డిస్కౌంట్‌ వివరాలను వెల్లడించింది.

సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే? :
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ 2025.. నవంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్ ఇప్పటికే లైవ్‌ లో ఉంది. ఈ సేల్‌ లో భాగంగా అనేక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, ఉత్పత్తులను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చని చెబుతోంది.

Flipkart Black Friday sale 2025

ఈ ఉత్పత్తులపై డిస్కౌంట్‌ లు :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌ లో భాగంగా స్మా్ర్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లు, స్మార్ట్‌వాచ్‌, టీవీలున్నాయి. దీంతోపాటు ఫ్రింటర్లు, హోం థియేటర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్‌, ఎయిర్‌ కండిషనర్‌ సహా ఇతర ఉత్పత్తులపై డిస్కౌంట్‌ లను పొందవచ్చు. వీటితోపాటు రూం హీటర్లు, గీజర్లులను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ASUS క్రోమ్‌బుక్‌ ల్యాప్‌టాప్‌పై డిస్కౌంట్‌! :
‌బ్లాక్ ఫ్రైడే సేల్‌ 2025 లో ఏ మోడల్‌ ఎంత ధరకు అందుబాటులోకి వస్తుందనే వివరాలను వెల్లడించలేదు. అయితే ASUS క్రోమ్‌బుక్‌ ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు శాంసంగ్‌, LG బ్రాండ్స్‌కు చెందిన టీవీలు, ఇతర గృహోపకరణాలపై డిస్కౌంట్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

త్వరలో బ్యాంకు ఆఫర్ల వివరాలు వెల్లడి :
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ లో భాగంగా క్రెడిట్‌, డెబిట్‌, UPI, EMI పేమెంట్స్‌ పై డిస్కౌంట్‌ లను పొందే అవకాశం ఉంది. అయితే బ్యాంకు కార్డుల డిస్కౌంట్‌ ల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ సేల్‌ నవంబర్‌ 23 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుండగా.. ఎన్ని రోజులపాటు నిర్వహించనుందనే వివరాలు తెలియలేదు. త్వరలో కేటగిరీల వారీగా సేల్‌ ఆఫర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది.

అమెజాన్ కూడా ప్రకటన చేస్తుందా? :
మరో ప్రముఖ సంస్థ అమెజాన్‌ కూడా దసరా, దీపావళి పండుగల సమయాల్లో గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌ పేరుతో సేల్‌ ను నిర్వహించింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్ ఫ్రైడే సేల్‌ 2025 ను ప్రకటన చేసిన నేపథ్యంతో.. అమెజాన్ కూడా ప్రత్యేక సేల్‌ ను ప్రకటన చేసినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు.

ఈ సంవత్సరం చివర్లో కూడా ఇ-కామర్స్‌ సంస్థలు ఇయర్‌ ఎండ్‌ సేల్‌ పేరుతో ప్రత్యేక సేల్‌ నిర్వహించే అవకాశం ఉంది. ఇ-కామర్స్ సంస్థల నుంచి ఇప్పటి వరకు ఈ సేల్‌ నిర్వహణపై ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Black Friday sale 2025 to start from november 23 here is the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X