ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. యూట్యూబ్ ప్రీమియం సహా అదిరిపోయే ప్రయోజనాలు..!
Flipkart Black Subscription : ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన చేసింది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ VIP వంటి సబ్‌స్క్రిప్షన్ లను ఇప్పటికే కలిగి ఉంది. అయితే కొత్తగా తీసుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ లో యూట్యూబ్ సహా మరిన్ని ప్రయోజనాలను అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ పూర్తి వివరాలు.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ధర, ప్రయోజనాల వివరాలు :
ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ఆధారంగా ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్‌షిప్ సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ ను తీసుకొనేందుకు రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. లిమిటెడ్ ఆఫర్ లో భాగంగా రూ.990 గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ VIP వార్షిక ప్లాన్ ధర రూ.799 గా ఉంది. అంటే బ్లాక్ కోసం డబుల్ ధర చెల్లించాల్సి ఉంటుంది.

యూట్యూబ్ ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు :
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్‌లో యూట్యూబ్ ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్ ను పొందవచ్చు. అంటే సంవత్సరం వరకు యూట్యూబ్ ను యాడ్స్ లేకుండా చూడవచ్చు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.1490 గా ఉంది. ఈ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ప్రత్యేకంగా యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ఆర్డర్స్ పై :
దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ లో భాగంగా ప్రతి ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ఆర్డర్ పై 5 శాతం సూపర్‌కాయిన్స్ క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. అయితే గరిష్ఠంగా రూ.100 పొందవచ్చు. సూపర్ కాయిన్స్ ట్రాన్సాక్షన్ పైన అదనంగా 5 శాతం డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లు ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయాల్లో ముందుగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రత్యేక డిస్కౌంట్ లు కూడా ఉంటాయి. దీంతోపాటు వేగవంతమైన డెలివరీలను పొందుతారు. మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
త్వరలో భారీ సేల్! :
ఫ్లిప్‌కార్ట్ నుంచి త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సేల్స్ లో ఈ ఫ్లిప్‌కార్ట్ బ్లా్క్ సబ్‌స్క్రిప్షన్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ సబ్‌స్క్రిప్షన్ లో ఫ్లిప్‌కార్ట్ కు సంబంధించిన ప్రయోజనాలను అందించడంతోపాటు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా అందించడం ఫ్లిప్‌కార్ట్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది.
ప్రత్యేక ప్రయోజనాలు :
ఈ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ లో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్టులో ప్రాధాన్యత ఉంటుంది. మరియు క్లియర్‌ట్రిప్ లో ఫ్లైట్ క్యాన్సిలేషన్, రీషెడ్యూల్ ను అత్యంత తక్కువ ఖర్చుతో చేయవచ్చు. అయితే ఒక్కసారి ఈ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకుంటే, వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు క్యాన్సిల్ చేసేందుకు అవకాశం ఉందదు. మరియు డబ్బులు వెనక్కి ఇవ్వరు.
అమెజాన్‌ను గట్టి పోటీనిస్తుందా?
ఈ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా అమెజాన్ అందిస్తోన్న ప్రైమ్ మెంబర్‌షిప్ కు గట్టి పోటీని ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెజాన్.. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది.


Click it and Unblock the Notifications








