ఈ సోప్ ఖరీదు ఐఫోన్ 8తో సమానం, జస్ట్ రూ. 55వేలు మాత్రమే, ఫ్లిప్‌కార్ట్ నుంచి డెలివరీ !

By Hazarath
|

ఈ కామర్స్ సైట్లలో ఏదన్నా ఒక వస్తువు ఆర్డర్ చేస్తే ఆ వస్తువు బదులు మరో వస్తువును పంపించడం లేదా రాళ్లు, రప్పలు డెలివరీ చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది. డెలివరీ అయిన తర్వాత వాటిని చూసుకుని వినియోగదారులు అవాక్కవుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు కూడా. తాజాగా 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ తబ్రేజ్ మెహబూబ్ నాగ్రాల్ కూడా ఇదే అనుభవాన్ని చవిచూశారు. తనకు ఎంతో ఇష్టమైన ఐఫోన్‌ 8ను ఈ-కామర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌ చేస్తే దానికి బదులు డిటర్జెంట్ బార్‌ను ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ చేసింది. కాగా ముందస్తుగానే డబ్బులు చెల్లించడంతో ఖంగుతిన్న ఈ కొనుగోలుదారు సెంట్రల్‌ ముంబైలోని బైకుల్లా పోలీసు స్టేషన్‌లో కంపెనీకి వ్యతిరేకంగా చీటింగ్‌ కేసు నమోదు చేశాడు.

 

రూ. 49 చెల్లించండి, 28 రోజులు ఎంజాయ్ చేయండిరూ. 49 చెల్లించండి, 28 రోజులు ఎంజాయ్ చేయండి

ఈ సోప్ ఖరీదు ఐఫోన్ 8తో సమానం, జస్ట్ రూ. 55వేలు మాత్రమే..

తాను ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 8ను ఆర్డర్‌ చేశానని, దీని కోసం ఫుల్‌ పేమెంట్‌ రూ.55వేలను చెల్లించినట్టు తెలిపాడు. ఈ ప్రీమియం మొబైల్‌ ఫోన్‌ బదులు ఫ్లిప్‌కార్ట్‌ డిటర్జెంట్ బార్‌ను నావీ ముంబైకి పక్కన ఉన్న పన్వేల్‌లోని తన ఇంటికి జనవరి 22న డెలివరీ చేసినట్టు పేర్కొన్నాడు. ఫ్లిప్‌కార్ట్‌కు వ్యతిరేకంగా చీటింగ్‌ కేసు నమోదైనట్టు బైకుల్లా పోలీసు స్టేషన్‌ సీనియర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అవినాష్‌ కూడా తెలిపారు. కాగా ఈ ఘటనపై తాము విచారణ జరుపుతున్నామని ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి కూడా చెప్పారు.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి ఈ జాగ్రత్తలు అవసరం.

HTTPS://

HTTPS://

ఏదైనా ఇ-కామర్స్‌ సైట్‌ ద్వారా కొనుగోలు చేసే ముందు HTTPS:// అనే దానిలోకి మాత్రమే వెళ్లండి. అందులో బై' బటన్‌ను క్లిక్‌ చేయగానే అడ్రస్‌ బార్‌లో హెచ్‌టిపిపి పక్కన ‘ఎస్‌' అనే అక్షరం దానికి లాక్ గుర్తు ఉంటాయి. అవి ఉంటే కొనుగోలుకు రెడీ అవ్వండి.

ఫేక్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ల జోలికి వెళ్లొద్దు.

ఫేక్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ల జోలికి వెళ్లొద్దు.

మార్కెట్లో పాపులర్‌ అయిన ఈ-కామర్స్‌ సైట్‌లలో మాత్రమే ఎంపిక చేసుకోండి. గుర్తింపులేని ఫేక్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ల జోలికి వెళ్లొద్దు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం ఓ వెబ్‌సైట్‌ను ఎంపిక చేసుకునే ముందు ఆ సైట్‌కు సంబంధించిన రివ్యూ రేటింగ్‌లను పరిశీలించడం మంచిది.బాగా పాపులరైన సైట్లలో మాత్రమే షాపింగ్‌ చేయాలి ఇలాంటి సైట్లు కస్టమర్ల విశ్వాసం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. వాటి విషయంలో భరోసాతో ఉండవచ్చు.

ప్రింట్‌ రూపంలో
 

ప్రింట్‌ రూపంలో

మీ ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను ప్రింట్‌ రూపంలో మీ వద్ద భద్రంగా ఉంచుకోండి. మీరు ఆర్డర్‌ చేసిన ఉత్పత్తులకు సంబంధించి ఏదైనా సమస్య ఎదురైతే వీటి ఉపయోగం ఉంటుంది.
విశ్వసనీయత లేని ఈ-కామర్స్‌ సైట్‌లలో షాపింగ్‌ చేయటం ద్వారా మీ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్స్‌ బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సమకూర్చుకోండి.

క్రెడిట్‌ కార్డులతో షాపింగ్

క్రెడిట్‌ కార్డులతో షాపింగ్

ఆన్‌లైన్‌ షాపింగ్‌కు క్రెడిట్‌ కార్డులను ఉపయోగించటం చాలా సురక్షితమైన పద్ధతి. ఆన్‌లైన్‌ ఫ్రాడ్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ సహాయంతో క్రెడిట్‌కార్డ్‌ను ఉపయోగించటం ద్వారా మీ షాపింగ్‌ మరింత సురక్షితంగా ఉంటుంది. షాపింగ్‌ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఆకౌంట్‌లను లాగ్‌అవుట్‌ చేయటం మరవద్దు.

నిబంధనలు, షరతులు

నిబంధనలు, షరతులు

కొనుగోలు చేసే వస్తువు బిల్లింగ్‌, గ్యారంటీ, డెలివరీ వంటి అంశాలకు సంబంధించి నిబంధనలు, షరతులను చదవండి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌లలో అనవసరంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్‌ చేయవద్దు. సెక్యూరిటీ కోడ్‌ విషయంలో జాగ్రత్త వహించండి.

ఫ్రీ వైఫై జోలికి పోవద్దు

ఫ్రీ వైఫై జోలికి పోవద్దు

పట్టణాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉచిత ఇంటర్నెట్‌ను అందించేందుకు వైఫై జోన్లు అందుబాటులో ఉంటాయి. ఉచితమని కొంత మంది ఇ-కామ్‌ లావాదేవీలకు ఫ్రీ వైఫైని ఉపయోగిస్తారు. ఇలాంటి సందర్భంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిపితే మీ వ్యక్తిగత సమాచారం మరోకరి చేతికి వెళ్లే ప్రమాదం ఉండవచ్చు.

క్యాష్‌ ఆన్‌ డెలివరీ బెటర్‌..

క్యాష్‌ ఆన్‌ డెలివరీ బెటర్‌..

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఇ-గిఫ్ట్‌ వోచర్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు చేయడానికి ఇష్టం లేని వారు సరుకు డెలివరీ అయిన తర్వాతనే చెల్లింపు చేసే విధంగా సిఒడిని ఎంచుకోవచ్చు. దీని వల్ల సరుకును చూసుకున్న తర్వాతనే చెల్లింపులు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart buyer alleges he got detergent bar instead of iPhone 8 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X