ఇక డబ్బులు లేకపోయినా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసేయవచ్చు

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, కార్డ్‌లెస్ క్రెడిట్ పేరుతో సరికొత్త పేమెంట్ ఆప్షన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది.

|

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, కార్డ్‌లెస్ క్రెడిట్ పేరుతో సరికొత్త పేమెంట్ ఆప్షన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ పేమెంట్ ఆప్షన్ క్రింద ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు రూ.60,000 వరకు ఇన్‌స్టెంట్ క్రెడిట్ అందుబాటులో ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

 

వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది...

వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది...

సరిగ్గా ఇటువంటి సదుపాయాన్నే అమెజాన్ పే ఈఎమ్ఐ క్రెడిట్ పేరుతో అమెజాన్ ఇండియా కూడా ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తన మెజార్టీ వాటాను ఇప్పటికే వాల్‌మార్ట్‌కు విక్రయించేసిన ఫ్లిప్‌కార్ట్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. తాజాగా లాంచ్ చేసిన కార్డ్‌లెస్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్‌లో క్రెడిట్ ను యాక్సిస్ చేసుకోవటంతో పాటు అంచనా ఇంకా దరఖాస్తు ప్రక్రియ వేగవంతంగా జరిగిపోతుందని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇన్‌స్టెంట్ క్రెడిట్‌ కోసం 60 సెకన్లు చాలు..

ఇన్‌స్టెంట్ క్రెడిట్‌ కోసం 60 సెకన్లు చాలు..

ఫ్లిప్‌కార్ట్ యూజర్లు ఇన్‌స్టెంట్ క్రెడిట్‌కు అప్లై చేయటానికి 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టదని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. వెబ్‌సైట్‌లో కస్టమర్ బిహేవియర్‌ను బట్టి రూ.60,000 వరకు క్రెడిట్‌ను కేటాయించటం జరుగుతుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. కార్డ్‌లెస్ క్రెడిట్ ద్వారా వస్తువును కొనుగోలు చేసిన తరువాత రీపేమెంట్‌కు సంబంధించి యూజర్ ముందు Pay Later next month, EMIs of 3-12 months వంటి రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వీటిలో ఏదో ఒక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం రీపేమెంట్ చేసే వీలుంటుంది.

పాపులర్ అవుతోన్న బై నౌ, పే లేటర్ కాన్సెప్ట్...
 

పాపులర్ అవుతోన్న బై నౌ, పే లేటర్ కాన్సెప్ట్...

బై నౌ, పే లేటర్ కాన్సెప్ట్ ఇప్పుడు ఈ-కామర్స్ విభాగంలో బాగా వర్క్ అవుట్ అవుతోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని చాలా మంది యూజర్లు అప్పటికప్పుడు నగదు చెల్లించకుండా షాపింగ్ అవసరాలను తీర్చుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ దగ్గర నుంచి చిరుద్యోగుల వరకు ఇటువంటి సర్వీసులను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.

 

 

 

బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలన్స్ లేక పోయినా..?

బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలన్స్ లేక పోయినా..?

పే లేటర్ సదుపాయం అనేది ఒక్క ఈ-కామర్స్ విభాగంలోనే కాకుండా రైల్వే టికెట్స్, బస్ టికెట్స్, మూవీ టెకెట్స్ ఇంకా ఫుడ్ ఆర్డర్స్ పై వర్తిస్తోంది. గతంలో ఏదైనా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు చెల్లింపు లేదా క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ట్రెండ్ మారటంతో అకౌంట్‌‍లో బ్యాలన్స్ లేకపోయినా Pay Later ఫీచర్ ద్వారా షాపింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

 

 

Best Mobiles in India

English summary
Flipkart Cardless Credit Introduced, Gives Buyers an Instant Credit Line Up to Rs. 60,000

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X