ఫ్లిప్‌కార్ట్ సీఈఓకి షాకిచ్చిన హ్యాకర్లు: డబ్బులివ్వాలంటూ డిమాండ్

Written By:

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ఫ్లిఫ్‌కార్ట్ వ్యవస్థాపక సీఈఓ బిన్నీ బన్సాల్‌కు హ్యాకర్లు షాకిచ్చారు. బిన్నీ బన్సాల్ ఈ మెయిల్ అకౌంట్ ని హ్యాక్ చేసిన హ్యాకర్లు భారీస్థాయిలో డబ్బును డిమాండ్ చేశారు. ఈ మెయిల్‌ను విడిచిపెట్టాలంటే 80 వేల డాలర్లు మా అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

Read more: చరిత్రలో అతి పెద్ద హ్యాకింగ్ : ఒక్క పదం మార్చి రూ. 673 కోట్లు దోపీడి

ఫ్లిప్‌కార్ట్ సీఈఓకి షాకిచ్చిన హ్యాకర్లు: డబ్బులివ్వాలంటూ డిమాండ్

హ్యాక్ చేసిన సీఈఓ మెయిల్ నుంచి ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు రెండు మెయిల్స్ పంపారు. వెంటనే డబ్బు తమ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బిన్నీ బన్సాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు, రష్యాలోని సర్వర్లను వాడుకున్న హ్యాకర్లు, హాంకాంగ్, కెనడాల్లోని ఐపీ అడ్రస్‌ల ద్వారా మెయిల్ ఐడీని హ్యాక్ చేశారని గుర్తించారు.

Read more: ఇంటర్నెట్‌లో మోడీని ఢీకొట్టే మొనగాడెవరు..?

ఫ్లిప్‌కార్ట్ సీఈఓకి షాకిచ్చిన హ్యాకర్లు: డబ్బులివ్వాలంటూ డిమాండ్

కాగా, సీఎఫ్ఓ సంజయ్ బవేజాకు మార్చి 1 ఉదయం 11:33కు ఈ ఈమెయిల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే ఆశ్చర్యపోయిన బెవాజా, బన్సాల్‌ను సంప్రదించి మెయిల్ హ్యాక్ అయినట్టు గుర్తించారు.ఈ సంధర్భంగా మీ వెబ్‌సైట్ హ్యాకర్ల భారీన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు మీ ముందుకు తెస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

మీ వెబ్‌సైట్‌లోని సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ అందుకుఅనుగుణంగా సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఈ చర్యను క్రమంగా పాటించినట్లయితే హ్యాకర్లు విజృంభించే అవకాశం ఉండదు.

 

 

2

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించటం ద్వారా హ్యాకర్ల చొరబాటును నిరోధించవచ్చు.

 

 

3

మీ వెబ్‌సైట్, గూగుల్స్ వెబ్ మాస్టర్ టూల్స్‌లో రిజిస్టర్ అయినట్లయితే మాల్వేర్ దాడులు జరిగిన సమయంలో తక్షన నోటిఫికేషన్ మీకు అందుతుంది. తద్వారా రక్షణాత్మక చర్యలకు పూనుకోవచ్చు.

 

 

4

ప్రముఖ వెబ్ కంపెనీలు హ్యాకర్ల భారి నుంచి రక్షణ పొందే కమ్రంలో సెక్యూరిటీ సేవలనందించే సంస్థలను నియమించుకుంటున్నాయి. ఈ సంస్థలు హ్యాకింగ్ నిరోధానికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలను కలిగి సదరు కంపెనీ వెబ్‌సైట్‌కు సంబంధించి నిరంతర పర్యవేక్షణను నిర్వహిస్తాయి.

5

స్టాప్‌ ద హ్యాకర్, సైట్ లాక్, సుకురీ, క్వాలిస్ వంటి సంస్థలు ఈ తరహా సెక్యూరిటీ సేవలనందిస్తున్నాయి. ఈ సెక్యూరిటీ సంస్థలను నియమించుకున్నట్లయితే సంవత్సారినికి కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Flipkart CEO Binny Bansal's email hacked, $80,000 sought
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot