బిన్ని బన్సల్ అనూహ్య నిర్ణయం,దూకుడు మీదున్న వాల్‌మార్ట్

By Gizbot Bureau
|

ఫ్లిప్‌కార్ట్ మాజీ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో బిన్నీ బన్సల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌కు విక్రయించిన తర్వాత వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్ని బన్సాల్‌ కొంత వాటాను అంటే 531 కోట్ల రూపాయల విలువైన 54 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి వాల్‌మార్ట్‌కే విక్రయించారు.

 బిన్ని బన్సల్ అనూహ్య నిర్ణయం,దూకుడు మీదున్న వాల్‌మార్ట్

తాజాగా జరిగిన ఈ విక్రయంతో బిన్నిబన్సాల్‌ తన ఈక్విటీ వాటాను మొట్టమొదటిసారిగా నగదీకరణ చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. వాల్‌మార్ట్ లక్సెంబర్గ్ సంస్థ ఎఫ్‌ఐటి హోల్డింగ్స్ సార్ల్‌కు ఈ వాటాను విక్రయించారు. 12 ఏళ్ల తర్వాత వ్యవస్థాపకుల వాటాను అమ్ముకున్నారు.

సుమారు ఏడాది తరువాత

సుమారు ఏడాది తరువాత

దేశీయ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ లో మేజర్‌ వాటాను (77శాతం) గ్లోబల్‌ ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసిన సుమారు ఏడాది తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ డీల్‌ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ మరో వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ సంస్థలో తన మొత్తం వాటాలను విక్రయించగా, బిన్సీ బన్సల్‌ మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ తరువాత కొంత కాలానికే లైంగిక ఆరోపణల నేపథ్యంలో బిన్నీ సంస్థనుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

 2022 నాటికి అమెరికా ఈక్విటీ మార్కెట్లోకి

2022 నాటికి అమెరికా ఈక్విటీ మార్కెట్లోకి

వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం తమ దృష్టి అంతా 20-30 కోట్ల మంది భారతీయులను కొత్తగా ఈ -కామర్స్‌ వైపు తీసుకురావటంపైనే ఉందని స్పష్టంచేసింది. ఐపీవోకు రావడం అన్నది తమ ఆకాంక్ష అని, కంపెనీ దీర్ఘకాల వ్యూహంలో ఇది భాగమే అయినప్పటికీ ప్రస్తుతమైతే దీనికి కాలపరిమితి లేదని పేర్కొంది. 2022 నాటికి అమెరికా ఈక్విటీ మార్కెట్లోకి ఫ్లిప్‌కార్ట్‌ అడుగుపెట్టనుందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. భారత్‌లో భారీ అవకాశాలు ఉన్నాయని, ఇక్కడి మార్కెట్‌ విషయంలో తమ ప్రణాళికలకు కట్టుబడి ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ స్పష్టం చేసింది.

 కొన్ని నెలలకే బిన్నీ కూడా రాజీనామా

కొన్ని నెలలకే బిన్నీ కూడా రాజీనామా

ఫ్లిప్‌కార్ట్‌ స్టాక్‌ ఎక్చేంజీలకు ఇచ్చిన నివేదిక ఆధారంగా చూస్తే బన్సాల్‌ తన వాటాలను 76.4 మిలియన్‌ డాలర్లకు బదలాయించారని తేలింది. సహవ్యవస్థాపకుడు సచిన్‌ బన్సాల్‌ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి వైదొలిగారు. వాల్‌మార్ట్‌ మొత్తం 77శాతం వాటాను కొనుగోలుచేసింది. 2018 మే 9వ తేదీ మొత్తం 16 బిలియన్‌ డాలర్లకు కొనుగోలుచేసిన సంగతి తెలిసిందే. మేనేజ్‌మెంట్‌ టీమ్‌లో బిన్నీ బన్సాల్‌ మాత్రం కొనసాగారు. ఆ తర్వాత కొన్ని నెలలకే బిన్నీ కూడా రాజీనామా చేసారు. 2018 నవంబరు 13వ తేదీ నిష్క్రమించారు. వాల్‌మార్ట్‌ విచారణలో వ్యక్తిగత ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించడంతో బిన్నీ వైదొలిగారు.

 అమ్మిన తర్వాత 63,53,838 వాటాలు

అమ్మిన తర్వాత 63,53,838 వాటాలు

తాజా విక్రయాల్లో బిన్నీ బన్సాల్‌ మొట్టమొదటి అమ్మకంగా ఈ విక్రయం కనిపిస్తోంది. బిన్ని ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు అమ్మిన తర్వాత కూడా 63,53,838 వాటాలు కలిగి ఉన్నారు. వాల్‌మార్ట్‌ టేకోవర్‌ నాటికి సుమారు 11,22,433 వాటాలను 159 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన వాటాలు బిన్నీ కలిగి ఉన్నారు. పేపర్‌డాట్‌ విసిసంస్థ అంచనాలప్రకారం బిన్ని బన్సాల్‌ తన వాటాను 0.33శాతం తగ్గించుకున్నారు. అంతకుముందున్న 3.85శాతం నుంచి 3.52 శాతానికి తగ్గించుకున్నారు.

 'గ్రోత్ క్యాపిటల్' పేరుతో ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్

'గ్రోత్ క్యాపిటల్' పేరుతో ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్

ఇదిలా ఉంటే ఫ్లిప్‌కార్ట్‌ తమ ప్లాట్‌ఫామ్‌లో సెల్లర్ల కోసం 'గ్రోత్ క్యాపిటల్' పేరుతో ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఇ-కామర్స్ సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న ఒక లక్ష మంది సెల్లర్లు 10 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి 48 గంటల్లో రుణాలు తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.3 కోట్ల వరకు లోన్ తీసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది . ఈ రుణాలకు 9.5 శాతం వడ్డీ ఛార్జ్ చేస్తాయి ఫైనాన్షియల్ కంపెనీలు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ 'గ్రోత్ క్యాపిటల్' ప్రోగ్రామ్‌ను రూపొందించింది.

బ్యాంకులు ఇవే

బ్యాంకులు ఇవే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, టాటా క్యాపిటల్, ఫ్లెక్సీలోన్స్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లెండింగ్ కార్ట్, ఇండిఫై, హ్యాపీ లోన్స్ సంస్థలు వ్యాపారులకు రుణాలు ఇవ్వనున్నాయి. సగటు లోన్ రూ.7 లక్షలు. లోన్ కాల వ్యవధి 12 నెలలు. ప్రభుత్వ అంచనా ప్రకారం దేశంలో 6 కోట్లకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలున్నాయి. వీటిలో చాలావరకు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవే. అయితే ఫ్లిప్‌కార్ట్ రూపొందించిన 'గ్రోత్ క్యాపిటల్' ప్రోగ్రామ్‌, టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీ సాయంతో వ్యాపారులకు, ఆర్థిక సంస్థలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే అవకాశముంది.

Best Mobiles in India

English summary
Flipkart co-founder Binny Bansal sells $76 million worth company shares to Walmart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X