ఫ్లిప్‌కార్ట్ డేస్ సేల్ మళ్లీ వచ్చేస్తోంది, 3 రోజులు పండగే
ముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వివిధ మొబైల్ ఫోన్స్ భారీ ఆఫర్లను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ పేరుతో ఐ ఫోన్, నోకియా, హానర్ బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్లన
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వివిధ మొబైల్ ఫోన్స్ భారీ ఆఫర్లను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ పేరుతో ఐ ఫోన్, నోకియా, హానర్ బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరల్లో అందుబాటులోకి తెచ్చింది. మే 31 వరకు సేల్ నిర్వహిస్తోంది. బిగ్ షాపింగ్ సేల్ మిస్ అయినవారికి ఈ మంత్ ఎండ్‌సేల్ ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది.

అయితే ఈ సేల్ కొనసాగుతుండగానే మళ్లీ కొత్త సేల్ కి తెరలేపింది. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సేల్ నిర్వహిస్తోంది. దీనిలో ల్యాపీలు, హెడ్ ఫోన్స్, టీవీల మీద భారీ ఆఫర్లను అందిస్తోంది.

రూ.1 సేల్‌తోపాటు పాటు..
జూన్ 1 నుంచి-3వతేదీవరకు నిర్వహించే ఈ సేల్‌లో టీవీలు, ఇతర గృహోపకరణాలతోపాటు ఇతర ప్రొడక్ట్‌లపై కూడా ఆఫర్లను ప్రకటించింది. నెలవారీ అందించే రూ.1 సేల్‌తోపాటు పాటు ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.

3 రోజుల ఆఫర్లు ఇవే
కిరణా సరుకులపై రూ.1 డీల్స్‌ను అందిస్తోంది
టీవీలపై 75శాతం డిస్కౌంట్
ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్‌పై 80 శాతం డిస్కౌంట్
దీంతోపాటు మరికొన్ని ఉత్పత్తులపై అదనంగా 15శాతం డిస్కౌంట్.
హోం అండ్ ఫర్నిచర్‌పై 30నుంచి 75శాతం దాకా డిస్కౌంట్.
ఫ్యాషన్ ఉత్పత్తులపై 40-80శాతం తగ్గింపు.
బేబీకేర్, బ్యూటీకేర్, పిల్లల బొమ్మలు, బుక్స్‌పై 80శాతం దాకా తగ్గింపు

ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం తక్షణ డిస్కౌంట్
ఈ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహించే ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. దీనికి అదనంగా యాక్సిస్ బ్యాంకు కార్డు లావాదేవీలపై 10శాతం డిస్కౌంట్ కూడా లభ్యమవుతోంది. అలాగే రెగ్యులర్ డిస్కౌంట్‌తోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. కేవలం రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది.

హెడ్‌ఫోన్లపై 70 శాతం రాయితీ
జేబీఎల్, సోనీ తదితర కంపెనీల హెడ్‌ఫోన్లపై 70 శాతం రాయితీ ఇవ్వనుండగా, హెచ్‌పీ, ఏసర్ తదితర ల్యాప్‌టాప్‌ల ధర రూ.12,990 నుంచి ప్రారంభం కానుంది. సిస్కా ఇతర బ్రాండ్ల పవర్ బ్యాంకులు, మొబైల్ కేస్‌లు, ఇతర యాక్సెసరీలపైనా భారీ ఆఫర్లు ఉన్నాయి. వీటి కనీస ధర రూ.99.
టీవీలు, అప్లయెన్సెస్‌పై ఫ్లిప్‌కార్ట్ 75 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. 32 అంగుళాల వీయూ స్మార్ట్ హెచ్‌డీ టీవీ ప్రారంభ ధర రూ.12,499 మాత్రమే. ఎయిర్ కండిషన్లు, రిఫ్రెజిరేటర్లపై 50 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ప్రెస్టీజ్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ రూ.999కే అందుబాటులో ఉండనుంది.

మంత్ ఎండ్ సేల్స్ ఆఫర్లు ఇవే
ఆపిల్ ఐఫోన్ ఎక్స్ (64జీబీ స్టోరేజ్) : రూ.66,499కు కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.91,900. సుమారు రూ.25 వేల భారీ తగ్గింపు
నోకియా 5.1 ప్లస్ : (3 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్) ధర రూ.8,199కే అందుబాటులో ఉంది. అసలు ధర. 13,199
నోకియా 6.1 : రూ.12,999. అసలు ధర రూ.17,600
హానర్ 9ఎన్ : ధర రూ.8,499. అసలు ధర. 13,999
హానర్ 10 లైట్ (4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ) : రూ.11,999, అసలు ధర రూ. 16, 999
ఎంఐ ఏ2 ఫోన్‌ను రూ.9,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇంకా శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 రూ. 36,990 (రూ.74,000) అలాగే గెలాక్సీ ఎ 20పై 1500 రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్.


Click it and Unblock the Notifications








