ఆసక్తిరేపుతున్న ఫ్లిప్‌కార్ట్ టీజర్, కొత్తగా ఏం తీసుకువస్తోంది ?

Written By:

ఈ కామర్స్‌లో దూసుకుపోతున్న దిగ్గజం ‌ఫ్లిప్‌కార్ట్ రెండు అతి పెద్ద అనౌన్స్ మెంట్లను మరి కొన్ని గంటల్లో చేయబోతోంది. అయితే అవి ఏంటనేది మాత్రం బయటకు రావడం లేదు కాని ఈ టెక్ గెయింట్‌ ఎక్స్ క్లూజివ్ గా ఏదో తీసుకుని వచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు కంపెనీ కొత్త సర్వీసులను వినియోగదారులకు పరిచయం చేయబోతుందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు ఈ కామర్స్ దిగ్గజం తన అఫిషియల్ వెబ్ సైట్లో ఈ లాంచ్ కి సంబంధించి #BigOnFlipkart పేరుతో టీజర్ విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ లో పొందుపరిచిన వివరాలను చూస్తే కంపెనీ నుంచి ఏదో సరికొత్త ఉత్పత్తి మార్కెట్లోకి రాబోతుందని తెలుస్తోంది.

Galaxy S9, Galaxy S9 plus కెమెరాపై ఆసక్తికర విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చిన్న వీడియోతో కూడిన ఓ టీజర్లో..

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ కృష్ణమూర్తి చిన్న వీడియోతో కూడిన ఓ టీజర్లో లాంచ్ కాబోయే ఉత్పత్తి గురించి కొన్ని హింట్స్ ఇచ్చారు. How big is the new Big అంటూ రెండు వాక్యాలను టీజర్లో చెప్పారు. కొత్తగా ఏదో వస్తుందనే సంకేతాన్ని దీని ద్వారా యూజర్లకు చెప్పకనే చెప్పారు.

మొబైల్ మార్కెట్లోకి కొత్త మొబైల్ ని

అయితే ఆయన చెప్పిన ప్రకాకం ఫ్లిప్‌కార్ట్ మొబైల్ మార్కెట్లోకి కొత్త మొబైల్ ని తీసుకొస్తుందనే ఊహగానాలు వెలువడుతున్నాయి. ఈ ఫోన్ మొబైల్ మార్కెట్లో కొన్ని మార్పులను తీసుకొస్తుందని, కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ట్విట్టర్లో

దీనిపై ట్విట్టర్లో యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చైనా కంపెనీల ఫోన్లు లాంచ్ చేయబోతున్నారని కొంతమంది ట్వీట్లు చేయగా, మరికొంతమంది మోటోరోలా, అసుస్, హువాయి లాంటి కంపెనీల ఫోన్లు ఎక్స్ క్లూజివ్ గా లాంచ్ చేయనుందని ట్వీట్ చేస్తున్నారు.

న్యూ ఢిల్లీ వేదికగా 12 గంటలకు

న్యూ ఢిల్లీ వేదికగా 12 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ ద్వారా చూడలనుకున్న ఓత్సాహికులు ఫ్లిప్ కార్ట్ .కామ్ ద్వారా వీక్షించవచ్చు. కాగా కొన్ని రిపోర్టుల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ Huawei P20 and P20 Pro స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Billion Capture Plusకి సక్సెసర్ గా..

దీంతో పాటు మోటో లైనప్ లో కూడా ఫోన్లను తీసుకువస్తుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. కాగా మరికొన్ని రూమర్ల ప్రకారం కంపెనీ గతేడాది లాంచ్ చేసిన Billion Capture Plusకి సక్సెసర్ గా మరొ కొత్త పోన్ తీసుకువస్తుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఏది నిజమనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart to disrupt Indian smartphone landscape with a big announcement on April 17 more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot