మరో బిగ్ సేల్‌తో గ్రాండ్‌గా దూసుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్

By Gizbot Bureau
|

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు మరోసారి గాలం వేసేందుకు రెడీ అయింది. మొన్నటిదాకా దసరా ఆఫర్ల ధమాకా మోగించిన ఫ్లిప్ కార్ట్ ఈ సారి మరో బ్రహ్మాండమైన బిగ్ దివాళీ సేల్‌ని నిర్వహించబోతోంది. అక్టోబర్ 11 రాత్రి 8 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. టీవీలు, అప్లయెన్సెస్ విభాగంలో 50,000 పైగా ప్రొడక్ట్స్‌పై 75% వరకు డిస్కౌంట్ అందించనుంది. రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ.6,490గా ఉండనుంది. 5 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై దాదాపు 90 శాతం వరకు తగ్గింపు ప్రకటించింది. 3 కోట్లకు పైగా ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ, ప్రొడక్ట్స్ ఎక్సేంజ్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఫ్యాషన్‌కి సంబంధించిన ఉత్పత్తులపై 50-80% వరకు, ఫర్నిచర్‌పై 40-80% వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 90% వరకు తగ్గింపు అందించనుంది.

స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
 

స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌ గురించి ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఖచ్చితమైన వివరాలను వెల్లడించకపోయినప్పటికీ, స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, బైబ్యాక్ గ్యారెంటీ, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌ను ఆశించవచ్చని కంపెనీ ప్రకటించింది. అయితే రెడ్‌మి నోట్ 7 ప్రో, వివో జెడ్ 1 ప్రో, రియల్‌మే సి 2, రియల్‌మే 5 ,రెడ్‌మి నోట్ 7 ఎస్ లాంటి ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించవచ్చని అంచనా.

90శాతం వరకు తగ్గింపు

90శాతం వరకు తగ్గింపు

బిగ్ దీపావళి సేల్‌లో టీవీలు, ఇతర 50 వేల ఉత్పత్తులపై 75 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ఇంకా స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌లాంటి ఎంపిక చేసిన ఉత్పత్తులపై 90శాతం వరకు తగ్గింపును ఆఫర్‌ చేయనుంది.

క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు

క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు

అలాగే ఎస్‌బిఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపుతోపాటు, నోకాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు అర్థరాత్రి 12 నుండి తెల్లవారుఝామున 2 గంటల మధ్య రష్ అవర్ వ్యవధిలో అదనపు డిస్కౌంట్లను అందిస్తుంది.

తగ్గే ల్యాపీలు ఇవే
 

తగ్గే ల్యాపీలు ఇవే

ఆపిల్ మ్యాక్ మీద 19 శాతం తగ్గింపు ఉండనుంది. రూ. 5666 నుంచి ఈఎమ్ఐ ప్రారంభం కానుంది. ఎక్స్చెంజ్ ఆఫర్ కింద 10, 200 తగ్గింపును అందిస్తోంది. Core i5 5th Gen processor ప్రాసెసర్ తో పాటుగా 8జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ ఉండనుంది.

Acer Aspire 5s Core i5 8th Gen

23 శాతం తగ్గింపు

దీని మీద రూ.8 వేల వరకు తగ్గింపు ఉండనుంది.

Asus VivoBook S Series Core i5 8th Gen

దీని ధర రూ. 49,990గా ఉంది. ఈఎమ్ఐ ప్లాన్ కింద రూ.4166 కట్టడం ద్వారా సొంతం చేసుకోవచ్చు.

Lenovo Ideapad 130 Core i3 7th Gen

ఇది 34శాతం తగ్గింపుతో రూ.25,490 కే సొంతం చేసుకోవచ్చు.

Acer Predator Helios 300 Core i5 8th Gen

ప్లిప్ కార్ట్ ద్వారా ఈ ల్యాపీ కొంటే రూ. 11 వేల విలువైన గేమ్స్ ఫ్రీగా పొందవచ్చు. దాంతో పాటుగా విండోస్ 10 ఓఎస్ ఉచితంగా లభిస్తంది.

Dell 14 3000 Core i3 7th Gen

దీనిపై 5 శాతం తగ్గింపు ఉంటుంది. నో కాస్ట్ ఈఎమ్ఐ ప్లాన్ ఆప్సన్ కూడా ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Diwali offers on laptops up to 50 off on apple, Dell, Acer, Asus, hp, Lenovo and more laptops

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X