Home
News

Flipkart Big Diwali sale 2023.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీగా తగ్గింపు.. లిస్ట్‌!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీవాళి సేల్‌ 2023లో (Flipkart Big Diwali sale 2023) భాగంగా అనేక ప్రముఖ సంస్థల ఫ్లాగ్‌షిప్‌, ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఐఫోన్‌ 14, శాంసంగ్‌ గెలాక్సీ S22, నథింగ్‌ ఫోన్‌ 2 సహా అనేక స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు మరింత తగ్గింపు ధరలు పొందుతారని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది.

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌లో భాగంగా ఐఫోన్ 14ను రూ.55,999కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్‌ ఆఫర్‌ ద్వారా మరో రూ.1500 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా రూ.42000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ఎక్స్చేంజీకి మీరు అర్హత సాధిస్తే ఐఫోన్‌ 14 బేస్‌ వేరియంట్‌ను రూ.12,499కే కొనుగోలు చేయవచ్చు.

iPhone 14 smartphone

శాంసంగ్‌ గెలాక్సీ S23 అల్ట్రా 5G: ఫ్లిప్‌కార్ట్‌ దీపావళీ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ రూ.1,04,999కు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా రూ.1750 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్‌ ద్వారా రూ.42,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.61,249కు సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ S22 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్‌ సంస్థ గత సంవత్సరం విడుదల చేసింది. ఈ ఫోన్‌ ప్రస్తుత ధర రూ.39,999గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్‌ ద్వారా రూ.35000 వరకు తగ్గింపును పొందవచ్చు.

iPhone 14 smartphone

నథింగ్‌ ఫోన్ 2 : ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ సంవత్సరం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.33,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ బోనస్‌ కింద రూ.8000 వరకు తగ్గింపును పొందవచ్చు.

ఒప్పో Find N3 Flip : ఒప్పో క్లామ్‌షెల్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.94,999కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.12000 వరకు తగ్గింపును పొందవచ్చు. అదే విధంగా ఎక్స్చేంజీ బోనస్‌ కింద రూ.8000 వరకు ధర తగ్గనుంది. ఫలితంగా ఈ ఫోన్ ధర భారీగా తగ్గనుంది.

ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్‌ 2023 నవంబర్‌ 2వ ప్రారంభం అయింది. 11 తేదీ వరకు సేల్‌ కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా SBI కార్డుతో చెల్లింపులు చేయడం ద్వారా 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందుతారు. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఇయర్‌బడ్స్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు, ఇతర గృహఉపకరణాలపై భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది.

దీంతోపాటు Sony, Nikon, Canon వంటి బ్రాండ్‌ల డిజిటల్‌ కెమెరాలపై డిస్కౌంట్లను అందించనుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మరియు నో కాస్ట్ ఈఎంఐ సహా ఇతర డిస్కౌంట్లను అందించనుంది. ఎక్స్చేంజీ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Flipkart Diwali sale 2023 offers huge discounts on many Flagship and premium smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X