Home
News

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్స్: ఈ స్మార్ట్‌ఫోన్‌లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన యొక్క పోర్టల్ లో ఇప్పుడు కొత్తగా మరొక అమ్మకాన్ని ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరుతో వస్తున్న ఈ అమ్మకాలు నేడు అంటే మే 17న ప్రారంభమయ్యి మే 21 వరకు జరగనున్నాయి. ఈ ఐదు రోజుల అమ్మకంలో పోకో మరియు రియల్‌మి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా అనేక బ్రాండ్ల మీద గొప్ప తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ఎవరైనా సరే రూ.15 వేల నుంచి రూ.20,000 ధరల విభాగంలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తూ ఉంటే కనుక ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పుడు జరిగే ఎలక్ట్రానిక్స్ సేల్ మంచి తగ్గింపు అవకాశాన్ని ఇస్తున్నది. తగ్గింపు ధరల వద్ద లభించే ఫోన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ అమ్మకంలో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ అమ్మకంలో బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్ అమ్మకంలో HDFC బ్యాంక్ కార్డులను కలిగి ఉన్న వారికి అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి ఉన్న వినియోగదారులు వారు కొనుగోలు మీద 12% వరకు డిస్కౌంట్ ను అందిస్తుంది. వీటితో పాటుగా నో-కాస్ట్ EMI, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్, ఎక్సచేంజ్ ఆఫర్స్ వంటి అద్భుతమైన ఆఫర్లను కూడా ఇస్తున్నది.

రియల్‌మి, పోకో స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప తగ్గింపు ఆఫర్స్

రియల్‌మి, పోకో స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప తగ్గింపు ఆఫర్స్

ఇండియాలో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ అమ్మకంలో ఇటీవల విడుదల అయిన రియల్‌మి మరియు పోకో ‌ఫోన్‌లను అద్బుతమైన తగ్గింపు ఆఫర్లతో పొందవచ్చు. పోకో X3 ప్రో ను రూ.16,799 తక్కువ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే పోకో X3 ని రూ.500 తగ్గింపు అందుకున్న తరువాత ఇప్పుడు రూ.15,499 ధర వద్ద పొందవచ్చు. అలాగే పోకో M3 ను రూ.10,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. రియల్‌మి సంస్థ యొక్క కొత్త ఫోన్లు నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే రియల్‌మి C12, C15, 7, X75G, X7 pro 5G స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద HDFC బ్యాంక్ వినియోగదారులకు 12% వరకు తగ్గింపును పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్

స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్

ఫ్లిప్‌కార్ట్ యొక్క ఎలక్ట్రానిక్స్ అమ్మకంలో శామ్‌సంగ్, ఆపిల్, మోటరోలా మరియు ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. ఇందులో ముఖ్యంగా శామ్‌సంగ్ గెలాక్సీ F41, ఆపిల్ ఐఫోన్ XR, మోటరోలా మోటోg 5G, శామ్‌సంగ్ గెలాక్సీ S20 ఫోన్లపై లభించే డిస్కౌంట్‌ ఆఫర్ల వివరాలు వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రకటించడం జరిగింది.

Best Mobiles in India

English summary
Flipkart Electronics Sale May 2021: Great Discount and Offers on Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X