Home
News

Flipkart ఎలక్ట్రానిక్స్‌ సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!

ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్స్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీగా ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్‌ మే 29 వరకు కొనసాగుతుంది. ఇందులో ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు నథింగ్ ఫోన్‌1, గూగుల్‌ పిక్సల్‌ 6a, ఐఫోన్‌ 13, శాంసంగ్‌ గెలాక్సీ S22+ సహా స్మార్ట్‌ఫోన్లపై ఫ్లాట్‌ డిస్కౌంట్లను ప్రకటించింది. తాజాగా విడుదలైన 5G స్మార్ట్‌ఫోన్లు పిక్సల్‌ 7a, పోకో F5, vivo X90 తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

గూగుల్‌ పిక్సల్‌ 7a స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో తాజాగా లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ అసలు ధర 43,999 రూపాయలు.. కానీ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో HDFC బ్యాంక్‌ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.4,000 తగ్గనుంది. దీంతో ఈ ఫోన్‌ కేవలం రూ. 39,999కే కొనుగోలు చేయవచ్చు.

 Flipkart electronics sale

పోకో F5 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.29,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా HDFC లేదా ICICI బ్యాంకు కార్డు కలిగిన వినియోగదారులు పోకో F5 ఫోన్‌ను కేవలం 26,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అలాగే ధర రూ.59,999 కలిగిన వివో X90 స్మార్ట్‌ఫోన్‌... ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.56,499కే సొంతం చేసుకోవచ్చు.

గూగుల్ 7a స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయలేని వారు.. గూగుల్‌ 6a ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా గూగుల్ 6a స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,000 ఫ్లాట్‌ డిస్కౌంట్‌ వస్తుంది. అలాగే HDFC బ్యాంక్ కార్డులు కలిగిన వినియోగదారులు అదనంగా మరో రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. 27,999 రూపాయలకే గూగుల్‌ 6a ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. నథింగ్‌ ఫోన్‌ 1ను ధర 29,999 రూపాయలకే ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్‌ ఐఫోన్‌ అభిమానులు iPhone 13ను భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 ధర ఆపిల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో రూ.69,900కు అందుబాటులో ఉంది. అదే ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ తాజా సేల్‌లో కొనుగోలు చేస్తే 61,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. సుమారు రూ.7,901 తగ్గింపును పొందుతారు. దీంతోపాటు HDFC బ్యాంకు కార్డులు కలిగిన వినియోగదారులు మరో 2000 రూపాయల అదనపు తగ్గింపును పొందవచ్చు. అంటే ఐఫోన్‌ 13ను కేవలం రూ.59,999కే కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ S23+ ఫోన్‌ ధర సుమారుగా రూ.74,999 ఉంది. ఇంత బడ్జెట్‌ పెట్టి కొనుగోలు చేయలేని వాళ్లు.. గత సంవత్సరం విడుదలైన శాంసంగ్‌ గెలాక్సీ S22+ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం గెలాక్సీ S22+ ఫోన్‌ ధర రూ.54,999గా ఉంది. యాక్సిస్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ.2,500 అదనంగా తగ్గింపును పొందుతారు. ఫలితంగా శాంసంగ్‌ గెలాక్సీ S22+ స్మార్ట్‌ఫోన్‌ను రూ.52,499 కొనుగోలు చేయవచ్చు.

గత సంవత్సరం శాంసంగ్‌ గెలాక్సీ S22+ ఫోన్‌ ప్రారంభ ధర రూ.84,999గా ఉండేది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా భారీగా తగ్గింపు ధరను పొందింది. ఈ ఫోన్‌కు నాలుగు సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్లు పొందవచ్చు. ఫలితంగా ఎటువంటి సాఫ్ట్‌వేర్‌ లేదా ఇతర సమస్యలు లేకుండా వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart electronics sale offers huge discounts on smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X