ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2022: డిస్కౌంట్ ఆఫర్లు ఇంక ఒక రోజు మాత్రమే..

|

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు తన యొక్క వెబ్‌సైట్ లో 'ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2022' పేరుతో ఒక సేల్ ని నిర్వహిస్తున్నది. జూన్ 17 వరకు జరిగే ఈ సేల్స్ రేపటితో ముగియనున్నాయి. ఈ సేల్స్ లో అనేక రకాల గాడ్జెట్‌లపై ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు డీల్‌లు ఉండడంతో పాటుగా గొప్ప డిస్కౌంట్‌లు కూడా లభిస్తాయి. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు మరియు బ్లూటూత్ స్పీకర్‌ల కొనుగోలు మీద గొప్ప డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

 

ఆన్‌లైన్ మార్కెట్‌

ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ పరికరాలపై బ్యాంక్ ఆఫర్‌లు కూడా అదనంగా ఉన్నాయి. ఇంకా కస్టమర్లు Paytm వాలెట్ ద్వారా చేసిన లావాదేవీలపై కూడా క్యాష్‌బ్యాక్‌లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యొక్క ఈ సేల్ ద్వారా డిస్కౌంట్ ధరలో కొనుగోలు చేసిన వాటిని కస్టమర్‌లకు వేగవంతమైన డెలివరీ ఎంపికలతో అందిస్తుంది.

నాయిస్ కలర్ ఫిట్ క్యాలిబర్ రూ.1,999 (MRP:రూ.3,999)

నాయిస్ కలర్ ఫిట్ క్యాలిబర్ రూ.1,999 (MRP:రూ.3,999)

ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సేల్ లో నాయిస్ కలర్‌ఫిట్ కాలిబర్ ని రూ.1,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. Paytm వాలెట్‌ని ఉపయోగించి ఈ స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ.40 వరకు క్యాష్‌బ్యాక్ ను కూడా పొందుతారు. నాయిస్ కలర్‌ఫిట్ క్యాలిబర్ స్మార్ట్‌వాచ్‌ 1.69-అంగుళాల టచ్-సపోర్టెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండి దుమ్ము మరియు నీటి నిరోధకతను కలిగి ఉన్న IP68-సర్టిఫైడ్ బిల్డ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 60 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉండడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను సులభంగా కొలవగలదు.

Realme Watch 2 రూ.2,999 (MRP: రూ.3,999)
 

Realme Watch 2 రూ.2,999 (MRP: రూ.3,999)

రియల్‌మీ వాచ్ 2 ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సమయంలో Rs.2,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. Paytm వాలెట్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.40 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 1.4-అంగుళాల కలర్ డిస్‌ప్లేను కలిగి ఉండి SpO2 బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ మరియు హృదయ స్పందన ట్రాకింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది 90 స్పోర్ట్స్ మోడ్‌లను మరియు ప్రీలోడెడ్ వాచ్ ఫేస్‌ల జాబితాను కలిగి ఉంటుంది.

Nothing Ear 1 రూ.4,999

Nothing Ear 1 రూ.4,999

ఫ్లిప్‌కార్ట్ లోని ప్రస్తుత సేల్ లో నథింగ్ ఇయర్ 1ని రూ.4,999 డిస్కౌంట్ ధరతో పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లకు అదనంగా 10 శాతం తగ్గింపును కూడా అందిస్తోంది. TWS ఇయర్‌బడ్‌లు ట్రాన్సపేరెంట్ డిజైన్ మరియు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) వంటి అద్భుతమైన ఫీచర్‌లతో వస్తాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఇయర్‌బడ్‌లు గరిష్టంగా 34 గంటల వినియోగాన్ని అందించగలవు.

Realme Buds Q2 రూ.1,999 (MRP : రూ.3,499)

Realme Buds Q2 రూ.1,999 (MRP : రూ.3,499)

Realme Buds Q2 ఫ్లిప్‌కార్ట్ లో రూ.1,999 డిస్కౌంట్ ధరతో పొందవచ్చు. ఈ TWS ఇయర్‌బడ్‌లను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్‌లు అదనంగా 10 శాతం తగ్గింపు పొందుతారు. ఫీచర్ల పరంగా ఈ Realme Buds Q2 బ్లూటూత్ 5.2తో మరియు ANC మద్దతును కలిగి ఉంది. ఈ ఇయర్‌బడ్‌లలో IPX5 వాటర్-రెసిస్టెంట్ బిల్డ్ మరియు 88ms లాటెన్సీ కూడా ఉంటుంది. ఇది గరిష్టంగా 28 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.

JBL హర్మాన్ ట్యూన్ 700BT హెడ్‌ఫోన్‌

JBL హర్మాన్ ట్యూన్ 700BT హెడ్‌ఫోన్‌

ఫ్లిప్‌కార్ట్ సేల్ లో JBL బ్రాండ్ యొక్క హర్మాన్ ట్యూన్ 700BT హెడ్‌ఫోన్‌ ని రూ.3,900 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు . అదనంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేసే లావాదేవీపై 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. JBL హర్మాన్ ట్యూన్ 700BT హెడ్‌సెట్ ఒక ఛార్జ్‌పై 27 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ హెడ్‌ఫోన్‌లలో బ్లూటూత్ v4.2 మరియు మల్టీపాయింట్ కనెక్టివిటీ మద్దతు కూడా ఉంది. అంతేకాకుండా అంతర్నిర్మిత 3.5mm జాక్ ద్వారా వైర్డు కనెక్టివిటీకి మద్దతు ఉంది.

Mi Boost Pro 30000mAh పవర్ బ్యాంక్ రూ. 2,499

Mi Boost Pro 30000mAh పవర్ బ్యాంక్ రూ. 2,499

ఫ్లిప్‌కార్ట్ సేల్ లో Mi Boost Pro 30000mAh పవర్ బ్యాంక్‌ను రూ.2,499 తగ్గింపు ధరతో లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ Mi Boost ప్రో 30000mAh పవర్ బ్యాంక్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. అలాగే ఇది పవర్ డెలివరీ (PD) 3.0 మద్దతును కలిగి ఉంది. పవర్ బ్యాంక్ అవుట్‌పుట్ కోసం రెండు USB పోర్ట్‌లను మరియు ఇన్‌పుట్ కోసం USB టైప్-C మరియు మైక్రో-USB పోర్ట్‌లను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Flipkart End of Season Sale 2022: Offers More Discounts on Smartwatches and TWS Earbuds

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X