ఇక పై ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేసే ప్రతి ఫోన్ కి ఇన్సూరెన్స్ లభిస్తుంది

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత, దాని స్క్రీన్ పాడవడం గానీ, ఇతర అనేక సమస్యలు జనరల్ గా వస్తూ ఉంటాయి .

|

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత, దాని స్క్రీన్ పాడవడం గానీ, ఇతర అనేక సమస్యలు జనరల్ గా వస్తూ ఉంటాయి .అలాంటప్పుడు ఉపయోగపడే విధంగా అనేక మొబైల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలు కూడా లభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై థర్డ్-పార్టీ మొబైల్ ఇన్సూరెన్స్ మీద ఆధారపడాల్సిన పనిలేకుండా ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఒక కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. బజాజ్ అలియాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో ఫ్లిప్కార్ట్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన అన్ని మొబైల్ ఫోన్లకు ఇకపై ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది.

ది బిగ్ బిలియన్ డేస్  సేల్‌లో భాగంగా.....

ది బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా.....

అక్టోబర్ 10వ తేదీ నుండి మొదలయ్యే ది బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఈ సరికొత్త ఇన్సూరెన్స్ స్కీమ్‌ని ప్రవేశపెడుతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

ఫోన్ కొనుగోలు చేయబోయే సమయంలో కేవలం 99 రూపాయల....

ఫోన్ కొనుగోలు చేయబోయే సమయంలో కేవలం 99 రూపాయల....

కొత్తగా ఫోన్ కొనుగోలు చేయబోయే సమయంలో కేవలం 99 రూపాయల ప్రారంభ ధర చెల్లించి వినియోగదారులు ఇన్సూరెన్సు సదుపాయాన్ని పొందవచ్చు. ఇప్పటికే ఎయిర్టెల్ వంటి అనేక సంస్థలు మొబైల్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇన్సూరెన్స్ లో భాగంగా.....

ఇన్సూరెన్స్ లో భాగంగా.....

ఇన్సూరెన్స్ లో భాగంగా ఉచిత పికప్, సర్వీసు చేసిన తర్వాత నేరుగా ఇంటికి డెలివరీ చేసే వెసులుబాటు ఇవ్వబడుతుంది.

ఫోన్ వినియోగదారుల్లో 36 శాతం మంది  స్మార్ట్ ఫోన్లు.....

ఫోన్ వినియోగదారుల్లో 36 శాతం మంది స్మార్ట్ ఫోన్లు.....

దేశవ్యాప్తంగా ఉన్న ఫోన్ వినియోగదారుల్లో 36 శాతం మంది స్మార్ట్ ఫోన్లు కలిగిఉన్నట్లు, ఒకసారి ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత స్క్రీన్ పాడవుతుందని, ఫోన్ పోతుందని వారు ఆందోళన చెందుతున్నట్లు, ఈ సమస్యలను అధిగమించడం కోసమే ఈ మొబైల్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

ఫోన్ కొన్న తర్వాత చాలామంది ఇన్సూరెన్స తీసుకోవటంలో....

ఫోన్ కొన్న తర్వాత చాలామంది ఇన్సూరెన్స తీసుకోవటంలో....

అయితే ఫోన్ కొన్న తర్వాత చాలామంది ఇన్సూరెన్స తీసుకోవటం విషయంలో ఆ శ్రద్ధ వహిస్తారు కాబట్టి ఫోన్ కొనుగోలు చేసే సమయంలోనే ఈ సదుపాయం ఉంటే పోతే పోయింది 99 రూపాయలు మాత్రమే కదా అని చాలా మంది ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Flipkart enters insurance business, offers smartphone protection.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X