అక్టోబర్ 24న ప్రారంభం కానున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్
రెండు ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దివాళీ సందర్బంగా మరో సారి బిగ్ సేల్స్‌తో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి.ఈ రెండిటి సేల్స్ ఈ నెల 24 న ప్రారంభం కానున్నాయి.
రెండు ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దివాళీ సందర్బంగా మరో సారి బిగ్ సేల్స్‌తో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి.ఈ రెండిటి సేల్స్ ఈ నెల 24 న ప్రారంభం కానున్నాయి. ఈ రెండుమాత్రమే కాకుండా మిగతా ఇ-కామర్స్ సైట్లూ ఫెస్టివల్ సేల్‌కు రెడీ అయిపోయాయి. దసరా సీజన్‌లో నిర్వహించిన ఫెస్టివల్ సేల్స్‌లో దిగ్గజ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ 5 రోజుల్లోనే రూ.15 వేల కోట్ల బిజినెస్ చేసాయి మరి ఈ దివాళీ సేల్స్‌లో ఎన్నివేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ 'ఫెస్టీవ్ ధమాకా డేస్'
అక్టోబర్ 10 నుంచి 14 వరకు 'బిగ్ బిలియన్ డేస్ సేల్ 2018' నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు 'ఫెస్టీవ్ ధమాకా డేస్' పేరుతో అక్టోబర్ 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు సేల్ నిర్వహించనుంది. అసుస్ ఇటీవల లాంఛ్ చేసిన జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1, జెన్‌ఫోన్ లైట్ ఎల్1 ఈ సేల్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డులు, డెబిట్ కార్డుపై ఈఎంఐ, నో కార్ట్ ఈఎంఐ, ఫోన్‌పేపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. ఏఏ ప్రొడక్ట్స్‌పై ఎంతెంత డిస్కౌంట్లు ఇస్తామనేది ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
దసరా సీజన్‌లో వేలకోట్ల బిజినెస్ చేసిన అమెజాన్ ఇప్పుడు దీపావళి సీజన్‌ను టార్గెట్ చేసింది. మళ్లీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. అక్టోబర్ 24న మొదలయ్యే సేల్ అక్టోబర్ 28న ముగుస్తుంది. ఈ ఐదురోజుల సేల్‌లో భారీ ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, నిత్యావసర వస్తువులు, పుస్తకాలు, మొబైల్‌ఫోన్స్‌పై ఆకట్టుకునే ఆఫర్స్‌తో మళ్లీ యూజర్లకు గాలమేస్తోంది. ఈ సేల్‌లో అమెజాన్‌లో ఎక్స్‌క్లూజీవ్ లాంఛెస్ కూడా ఉండబోతున్నాయి. షియోమి రెడ్‌మీ 6ఏ ఫ్లాష్ సేల్ ప్రతీ రోజూ ఉంటుంది.

క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్....
ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్‌తో పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. అమెజాన్ పే యూజర్లు రూ.5,000 కన్నా ఎక్కువ టాప్-అప్ చేస్తే రూ.250 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎప్పట్లాగానే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, ఇకో స్మార్ట్ స్పీకర్లు డిస్కౌంట్‌లో లభిస్తాయి. అలెక్సా ఉన్న డివైజ్‌లు కూడా 70 శాతం వరకు డిస్కౌంట్‌పై లభించనున్నాయి. కిండిల్ సబ్‌స్క్రిప్షన్ కూడా తగ్గింపు ధరతో లభించనుంది. అసలు ధర రూ.2,388 కాగా ఆఫర్ ధర రూ.1,499 మాత్రమే.

స్నాప్‌డీల్ 'మెగా దివాళీ సేల్'
స్నాప్‌డీల్ కూడా 'మెగా దివాళీ సేల్' నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ అక్టోబర్ 21 వరకు కొనసాగనుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్స్, డిజిటల్ వ్యాలెట్స్, కూపన్ కోడ్స్ ద్వారా 25 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications








