ఫ్లిప్‌కార్ట్ 'ఫెస్టివ్ ధమాకా డేస్' సేల్ లో దుమ్మురేపబోతోన్న ఆఫర్స్ ఇవే !
దేశీయ ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 24వ తేదీ అర్థరాత్రి రెండు గంటల నుంచి ప్రారంభమయ్యే 'ఫెస్టివ్ ధమాకా డేస్' సేల్స్‌లో సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది.
దేశీయ ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 24వ తేదీ అర్థరాత్రి రెండు గంటల నుంచి ప్రారంభమయ్యే 'ఫెస్టివ్ ధమాకా డేస్' సేల్స్‌లో సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఆఫర్లు మొదలైన తొలి రెండు 'రష్ అవర్స్'లో అదనపు డిస్కౌంట్స్ అందజేస్తోంది. ఈ ఆఫర్లలో స్మార్ట్ ఫోన్లు చేర్చారు. ఈ ఫెస్టివ్ సేల్స్ ఆఫర్ ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతాయి.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్యులకు స్పెషల్ ఆఫర్లు....
అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్యులకు స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుంచే అందుబాటులోకి తెస్తాయి. అంటే మూడు గంటల ముందే ఫ్లిప్ కార్ట్ సభ్యులకు ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి .

స్మార్ట్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు....
స్మార్ట్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి. లెనొవో కే8 ప్లస్ మొబైల్ ఫోన్ రూ.6,999, వివో వీ9 ఫోన్ రూ.15,990, ఒప్పో ఎఫ్9 ఫోన్ రూ.18,990లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లు లభిస్తాయి. వీటితోపాటు పూర్తిగా మొబైల్ ఫోన్ రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు ఎక్స్చేంజ్ ఆఫర్లు, బై బ్యాక్ గ్యారంటీ అందజేస్తోంది.

హోమ్ అప్లయెన్సెస్, ఫర్నీచర్, దుస్తులపై 40 నుంచి 80 శాతం డిస్కౌంట్....
హోమ్ అప్లయెన్సెస్, ఫర్నీచర్, పురుషుల పాదరక్షలు, దుస్తులపై 40 నుంచి 80 శాతం, మహిళల దుస్తులపై 50-80%, పురుషుల యాక్సెసరీస్ పై 20-80 శాతం డిస్కౌంట్లు అందజేస్తోంది. ఒకవేళ కస్టమర్ రూ.1501 షాపింగ్ చేస్తే రూ.201, రూ.3001 షాపింగ్ చేస్తే రూ.501 రాయితీనిస్తున్నది. అదనంగా ఫోన్ పే ద్వారా గానీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో జరిపే ఈఎంఐ కొనుగోళ్లపై రాయితీలు అందచేస్తోంది.

టీవీలు, అప్లియెన్సెస్ పై కంపెనీ 70 శాతం ఆఫర్లు...
టీవీలు, అప్లియెన్సెస్ పై కంపెనీ 70 శాతం ఆఫర్లు అందజేస్తోంది. వాటిలో ఐఎఫ్ ఫాల్కన్ స్మార్ట్ టీవీ ధర రూ. 41.999, శాంసంగ్ HD టీవీ రూ.15,999, హింద్ వేర్ గేయ్సర్ రూ.1999లపై ఎక్సైటింగ్ డిస్కౌంట్లు కల్పిస్తోంది.

ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ వస్తువులపై 80 శాతం రాయితీ ఇస్తోంది.....
వీటితోపాటు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ వస్తువులపై 80 శాతం రాయితీ ఇస్తోంది. డీఎస్ఎల్ఆర్ పై రూ.15 వేల వరకు రాయితీనిస్తోంది. రూ.21,990 విలువ గల హెడ్ ఫోన్లు, స్పీకర్లు, కోర్ ఐ3 ల్యాప్ టాప్ లపై 75 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.


Click it and Unblock the Notifications








