బెంగుళూరులో అతి పెద్ద ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం

Written By:

ఈ-కామర్స్‌లో దూసుకుపోతున్న దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బెంగళూరులో అతిపెద్ద కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. బెంగుళూరుతో ఉన్న నాలుగు క్యాంపస్ లు అన్నింటినీ ఒకే చోటుకి చేర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కాగా మార్చి 31న ఈ కొత్త కార్యాలయాన్ని గప్ చుప్ గా ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. ఈ లాంచింగ్ సమయంలో Flipkart CEO Kalyan Krishnamurthy, founders Binny Bansal and Sachin Bansalలు దగ్గరుండి అన్ని పనులను పర్యవేక్షించారు. కాగా బెంగళూరులోని ఎంబసీ టెక్‌ విలేజ్‌లో అధునాతన వసతులతో తమ కొత్త క్యాంపస్‌ను తీర్చిదిద్దామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ నిర్మాణంతో బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లోని తమ కార్యాలయాలను ఎంబసీ టెక్‌ విలేజ్‌ ప్రాంగణానికి తరలించామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 'బెటర్‌.టుగెదర్‌' థీమ్‌ కింద ఫ్లిప్‌కార్ట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

బెంగుళూరులో అతి పెద్ద ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం

'బెంగళూరు వ్యాప్తంగా ఉన్న ఆపీసులన్నింటిన్నీ ఒకే ప్రాంగణానికి చేర్చాలని మేము నిర్ణయించాం. దీనివల్ల నిర్వాహక సామర్థ్యం మెరుగు పడుతుంది. సిబ్బంది-బృందాల మధ్య సమన్వయం అధికమవుతుంది' అని ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ప్లేస్‌ అధినేత అనిల్‌ గోటేటి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన కొత్త ప్రాంగణానికి తమ టీమ్‌ను తరలించామని, కొత్త క్యాంపస్‌ ఆపరేషన్స్‌ ప్రారంభమయ్యామని కూడా తెలిపారు.

Moto G5s స్మార్ట్‌ఫోన్‌పై రూ. 5వేలు తగ్గింపు, ఒక్కరోజు మాత్రమే, Moto G6 లాంచ్ డేట్ షురూ !

బెంగుళూరులో అతి పెద్ద ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం

7,387 మంది పనిచేసేందుకు వీలుగా 8.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త కార్యాలయం ఉంది. మొత్తం 30 ఫ్లోర్లతో ఈ ఆఫీసు ఉంది. ఈ కార్యాలయాన్ని రూపొందించే సమయంలో ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు, ఐడియాలను స్వీకరించామని గోటేటి తెలిపారు.

ఈ కార్యాలయంలో ఉద్యోగుల కోసం పుడ్ కోర్టు, జిమ్, డే కేర్ లాంటి అధునాతన సదుపాయాలను ఏర్పాటుచేశారు. వీటితో పాటు ఇండోర్ రిక్రియేషన్ రూమ్స్ మాదిరిగా గోల్ప్ కోర్టు, వీఆర్ గేమ్స్, అలాగే అవుట్ డోర్ రిక్రియేషన్స్ గేమ్స్ అయిన బాస్కెట్ బాల్, క్రికెట్ లాంటి సదుపాయలను ఉద్యోగులకు కల్పించారు. అలాగే క్విజ్ గేమ్స్ కి సంబంధించినవి ఓ రూములో పొందుపరిచారు.

English summary
Ecommerce major Flipkart is consolidating all its offices to operate from one campus. The Bengaluru-based company, which was spread across four campuses so far, is now moved to Embassy Tech Village in Outer Ring Road.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot