ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ 2024.. స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గ్యాడ్జెట్‌లపై గరిష్ఠంగా 80 శాతం డిస్కౌంట్‌లు..!
ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ 2024 (Flipkart Flagship Sale 2024) ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అయింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను తగ్గింపు ధరలకే కొనుగోలు చేయవచ్చు. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న సేల్‌లో ఆపిల్, గూగుల్, శాంసంగ్ సహా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫ్లాగ్‌షిప్ మోడళ్లను కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ 2024 లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు, BOB క్రెడిట్ కార్డు, యెస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఫ్యాషన్ ఉత్పత్తులపై 50-80 శాతం, టీవీలు సహా ఇతర ఉత్పత్తులపై 80 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం, స్మార్ట్ గ్యాడ్జెట్‌లపై 50-80 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ : మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.21,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల పుల్ HD+ pOLED 3D కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
పోకో F6 5G స్మార్ట్‌ఫోన్ : ఈ హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 HyperOS, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 50MP + 8MP కెమెరాలు సహా 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.25,999 గా ఉంది.

గూగుల్ పిక్సల్ 7 : ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.30,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6.3 అంగుళా పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS, Tensor G2 CPU చిప్‌సెట్ మరియు టైటాన్ M2 సెక్యూరిటీ ప్రాసెసర్‌లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 20W వైర్ మరియు 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4270mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ 6.7 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5nm A15 బయోనిక్ చిప్‌సెట్‌పైన పనిచేస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 12MP+12MP కెమెరాలు సహా 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.54,999 కే సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








