భారీ సబ్సిడీ, అదిరే ఫీచర్లతో మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లు, పెట్రోల్‌కి సెలవిక !

|

మేడ్ ఇన్ ఇండియాకి ఊపు వచ్చింది. బెంగళూరు ఆధారిత స్టార్టఅప్‌ కంపెనీ ఏథర్ మేడిన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశంలో తయారైన స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఈ ఎనర్జీ ఫ్లాగ్‌షిప్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్‌ మద్దతుతో ఎథర్ కంపెనీ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఏథర్‌ 340, ఎథర్ 450 పేరిట మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కావాలనుకునే వినియోగదారుల కోసం ఎథర్ వెబ్‌సైట్‌తోపాటు బెంగుళూరులోని ఎథర్ స్టోర్‌లో ప్రీ బుకింగ్స్‌ చేపట్టారు.

 

జేబులోనే పేలిపోయిన మొబైల్, అంతా క్షణాల్లోనే, షాకింగ్ వీడియో ఇదే !జేబులోనే పేలిపోయిన మొబైల్, అంతా క్షణాల్లోనే, షాకింగ్ వీడియో ఇదే !

ఆన్‌రోడ్ ధర

ఆన్‌రోడ్ ధర

ఏథర్ 450 ఆన్‌రోడ్ ధర రూ.1,24,750 ఉండగా, ఏథర్ 340 ఆన్‌రోడ్ ధర రూ.1,09,750 గా ఉంది. మీరు ఇంటి దగ్గర, ఆఫీసు, లేదా సాధారణ సాకెట్ నుండి ఈ వాహనాన్ని ఛార్జ్ చేసుకుని వినియోగించుకోవచ్చు.

22 వేల రూపాయల సబ్సిడీ

22 వేల రూపాయల సబ్సిడీ

ఇందులో ఎలక్ట్రిక్‌వాహనాలకు ప్రోత్సాహమిచ్చే ప్రభుత్వ పథకం "ఫేం" కింద 22 వేల రూపాయల సబ్సిడీ జీఎస్‌టీ, రోడ్‌ట్యాక్స్, స్మార్ట్ కార్డ్ ఫీజు, రిజిస్ట్రేషన్ కార్డు, ఇన్సూరెన్స్ అన్నీరేట్లను కలిపి ఈ ధర అని తెలిపింది.

 ఈఎంఐ ఆఫర్
 

ఈఎంఐ ఆఫర్

కొనుగోలు మీద ఆసక్తి ఉన్న వారికోసం కంపెనీ ఈఎంఐ కూడా ఆఫర్‌ చేసింది. దీంతో పాటు 700రూపాయల నెలవారీప్లాన్‌ను కూడా కంపెనీ లాంచ్‌ చేసింది. ఇందులో సర్వీసు, డోర్‌స్టెప్‌ పికప్‌, డెలివరీ, బ్రేడ్‌ డౌన్‌ అసిస్టెన్స్‌, వాహనాలపై డేటా ఛార్జీలు, వినియోగం, ఇంధనం లాంటి ఇతర సేవలను ఆఫర్‌ చేస్తోంది.

ఫీచర్ల విషయానికొస్తే..

ఫీచర్ల విషయానికొస్తే..

7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అందులో స్పీడ్, బ్యాటరీ కెపాసిటీ, తిరిగిన కిలోమీటర్లు, నావిగేషన్ వంటి సదుపాయాలు లభిస్తున్నాయి. ఇక ఈ స్కూటర్లలో ఉండే సాఫ్ట్‌వేర్‌కు ఎప్పటికప్పుడు ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) రూపంలో అప్‌డేట్లను అందిస్తారు.

మొబైల్ యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్..

మొబైల్ యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్..

ఈ స్కూటర్లను మొబైల్ యాప్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా స్కూటర్ ఎక్కడ ఉంది ఫోన్‌లో లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.

బ్యాటరీ లైఫ్‌

బ్యాటరీ లైఫ్‌

ఈ స్కూటర్లలో ఉన్న బ్యాటరీ లైఫ్‌ 5 నుంచి 6 సంవత్సరాలు వరకు వస్తుందని కంపెనీ తెలిపింది. ఐపీ67 రేటింగ్ ఈ బ్యాటరీ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను జోడించింది. ఈ బ్యాటరీలు 50వేల కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి.

Image soruce : Singapore News Network

1 నిమిషం పాటు చార్జింగ్ పెడితే..

1 నిమిషం పాటు చార్జింగ్ పెడితే..

కేవలం 1 నిమిషం పాటు చార్జింగ్ పెడితే చాలు, 1 కిలోమీటర్ దూరం వెళ్లగలిగేంత వేగంగా చార్జింగ్ అవుతాయి. ఈ స్కూటర్లలో ఉన్న బ్యాటరీ పూర్తి చార్జింగ్‌కు 4 గంటల 18 నిమిషాల సమయం పడుతుంది.

ప్రత్యేకమైన బ్యాటరీలు

ప్రత్యేకమైన బ్యాటరీలు

దీనికోసం ప్రత్యేకమైన బ్యాటరీలను ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్లకు 2 ఏళ్ల వారంటీ (30వేల కిలోమీటర్లు)ని అందిస్తున్నారు. అంతేకాదు బ్యాటరీకి 3 ఏళ్ల వారంటీని అందిస్తోంది. రెండు మోడల్స్‌లోను సిమ్‌కార్డుల ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి.

ఎథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌

ఎథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌

సిటీ రైడింగ్ కండిషన్స్‌కు అనుకూలంగా తయారు చేసిన ఎథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌ గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.9 సెకండ్లలోనే గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌ను ఈ స్కూటర్ సొంతం.

ఎథర్ 340 స్కూటర్

ఎథర్ 340 స్కూటర్

అలాగే ఎథర్ 340 స్కూటర్ గంటకు గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ స్కూటర్ 5.1 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందుకోగలదు.

30 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు

30 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు

ఏథర్ ఎనర్జీ బెంగళూరు నగర వ్యాప్తంగా ఇప్పటికే 30 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఏథర్‌గ్రిడ్ ఛార్జింగ్ స్టేషన్లు ఫాస్ట్-ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.

43 మిలియన్ డాలర్ల మేర నిధులు

43 మిలియన్ డాలర్ల మేర నిధులు

దేశంలోని నెంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, వాల్ మార్ట్ భాగస్వామి ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు, హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌ సహా, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పెట్టుబడిదారుల నుండి ఇప్పటివరకు ఏథర్‌ ఎనర్జీ కంపెనీ 43 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.

ఈ ఏడాది చివరి నాటికి ..

ఈ ఏడాది చివరి నాటికి ..

అమెరికాలోని టెస్లా తరువాత ఈ తరహాలో ఎలక్ట్రిక్‌ బైక్స్‌లను తయారుచేస్తున్న తొలి సంస్థగా ఏథర్‌ నిలవనుంది. అయితే ఈ వాహనాలు తొలుత బెంగళూరులో మాత్రమే లభ్యమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇతర నగరాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Flipkart founder-backed Indian startup launches subsidised electric scooter More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X