Home
News

ఫ్లిప్‌కార్ట్‌లో Goat sale 2024 తేదీలు వెల్లడి.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక డిస్కౌంట్‌లు..!!

ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ జులై 20, 21 తేదీల్లో ప్రైమ్ డే సేల్‌ 2024 పేరిట ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. మరో ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కూడా జులై 20 నుంచి 25వ తేదీ వరకు GOAT Sale (Greatest Of All Time Sale) పేరుతో సేల్‌ నిర్వహించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఇతర ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్ల వరకు భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చని తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్ గోట్‌ సేల్‌లో భాగంగా యాక్సెస్‌, HDFC, IDFC ఫస్ట్‌ బ్యాంకు కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S23, ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, నథింగ్‌ ఫోన్‌ 2a, గెలాక్సీ S23 FE, పిక్సల్‌ 8 వంటి స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Flipkart goat sale 2024 dates

ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం ఎర్లీ బర్డ్ సేల్‌ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనేక ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. పోకో M6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.8999 కే కొనుగోలు చేయవచ్చు. అదే CMF ఫోన్‌ 1 ను బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.14,999 కే సొంతం చేసుకోవచ్చు. మరియు పోకో X6 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.22,999 గా ఉంది.

మోటోరోలా 50 ప్రో మోడల్ ధర రూ.27,999 గా ఉంది. అదే పిక్సల్‌ 7 ధర రూ.32999 మరియు ఐఫోన్ 14 ప్లస్‌ ధర బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.53999 గా ఉంది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఎర్లీ బర్డ్‌ సేల్‌ జులై 15 న ప్రారంభం అయింది. జులై 18 వరకు కొనసాగుతుంది. యాక్సెస్‌, HDFC, IDFC ఫస్ట్ బ్యాంకు కార్డుల ద్వారా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

అయితే ఈ ఫ్లిప్‌కార్ట్ గోట్‌ సేల్‌ డిస్కౌంట్‌లు, బ్యాంకు ఆఫర్లు వంటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అమెజాన్ కేవలం రెండు రోజులపాటు మాత్రమే సేల్‌ నిర్వహిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 20 నుంచి 25 వరకు సేల్‌ నిర్వహిస్తోంది. అయితే అమెజాన్‌ తన సేల్‌ డిస్కౌంట్‌ల వివరాలను వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి డిస్కౌంట్‌ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

అమెజాన్‌ సేల్‌లో భాగంగా శాంసంగ్‌, వన్‌ప్లస్‌, షియోమీ, ఐకూ, రియల్‌మి, పోకో, హానర్‌, మోటోరోలా, లావా, నోకియా, వివో సహా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా 24 నెలల నో కాస్ట్ EMI సహా ఎక్స్చేంజీ ఆఫర్లను పొందవచ్చు. మరియు కూపన్ల ద్వారా తగ్గింపును పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart goat sale 2024 dates revealed huge discount on many smartphones full list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X