ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ల హోరు, రూ. 10 వేలకే ల్యాపీలు

Written By:

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మళ్లీ ఆఫర్ల జోరు కొనసాగించనుంది. ఒక సేల్‌ అనంతరం మరో సేల్‌ నిర్వహిస్తూ అమెజాన్ కు గట్టిపోటీనిస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా గ్రాండ్‌ గాడ్జెట్‌ డేస్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించింది. ఈ సేల్‌ కింద గేమింగ్‌ హార్డ్‌వేర్‌, ల్యాప్‌టాప్స్‌, కెమెరాలు, ఆడియా యాక్ససరీస్‌పై బెస్ట్‌ డీల్స్‌ను, ఆఫర్లను ప్రకటించింది. జూలై 26 వరకు ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తోంది.

ఫేస్‌బుక్‌లో ఉన్న లోపం గురించి తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గాడ్జెట్‌లు అతి తక్కువకు

ఈ సేల్‌లో గాడ్జెట్‌లు అతి తక్కువకు 999 రూపాయలకే లభ్యం కానున్నాయి.

ఇంటెల్‌ కోర్‌ ఐ3

ఇంటెల్‌ కోర్‌ ఐ3, ఇంటెల్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్‌తో రూపొందిన ల్యాప్‌టాప్‌లను ఫ్లిప్‌కార్ట్‌ 26,990 రూపాయలకు, 41,990 రూపాయలకు లిస్టు చేసింది.

రూ.10,499 నుంచే ప్రారంభం

బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌లు ఏసర్‌, ఐబాల్‌, లావా,మైక్రోమ్యాక్స్‌ ల్యాప్‌టాప్‌ ధరలు అతి తక్కువకు రూ.10,499 నుంచే ప్రారంభం కానున్నాయి.

టూ-ఇన్‌-వన్‌ ల్యాప్‌టాప్‌

గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై ఎక్స్చేంజ్‌ 20వేల రూపాయల వరకు ఉంది. అంతేకాక, టూ-ఇన్‌-వన్‌ ల్యాప్‌టాప్‌లను 25,990 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.

ఇంటెల్‌

ఏఐఓ డెస్క్‌టాప్‌ కలిగిన ఇంటెల్‌ ఇంటెల్‌, లెనోవో, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ ధరలు రూ.32,490 నుంచే ప్రారంభం కానున్నాయి.

డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా

ఈ గ్రాండ్‌ గాడ్జెట్‌ సేల్‌లో కానూన్‌ ఈఓఎస్‌ 700డీ డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా రూ.39,499కి లభ్యంకానుంది. అదేవిధంగా ఈ కెమెరాతో పాటు రూ.6,999 విలువ గల మోటో హెడ్‌ఫోన్స్‌ ఉచితంగా లభించనున్నాయి.

యాక్షన్‌ కెమెరా కూడా రూ.36,100కే

గోప్రో హిరో 5 స్పోర్ట్స్‌, యాక్షన్‌ కెమెరా కూడా రూ.36,100కే లభించనుంది. వీటితోపాటు ఐపాడ్‌, టాబెట్లపై ఫ్లిప్‌కార్ట్‌ బెస్ట్ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది.

ఆపిల్‌, లెనోవో, శాంసంగ్‌

ఆపిల్‌, లెనోవో, శాంసంగ్‌, మైక్రోమ్యాక్స్‌, ఐబాల్‌ వంటి టాబ్లెట్లపై గ్రేట్‌ డిస్కౌంట్లను, ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, హోమ్‌ థియేటర్‌ సిస్టమ్స్‌ వంటి ఆడియో యాక్ససరీస్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను ప్రకటించింది.

యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుదారులకు

అదనంగా యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుదారులకు 5 శాతం తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Grand Gadget Day Sale Offers: Deals on Laptops, Cameras, Tablets, and More Read more At Gibot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting