ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్

Posted By:

భారతదేశపు ప్రముఖ ఇ-కామర్స్ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) స్వతహాగా ఓ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రముఖ వెబ్ మీడియా బీజీఆర్ వెల్లడించిన వివరాల మేరకు ఫ్లిప్‌కార్ట్ తాను ప్రారంభించబోయే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ వెల్లడించలేదట.

 ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్

భారత్ మార్కెట్లో మోటరోలా మోటో జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను తన రిటైలింగ్ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ దేశవ్యాప్తంగా ఓ  సంచలనంగా నిలిచింది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పనలో భాగంగా ఇంటెల్, మీడియా టెక్, క్వాల్కమ్ వంటి చిప్ తయారీ కంపెనీలతో గత రెండు సంవత్సరాలుగా ఫ్లిప్‌కార్ట్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

అంతా అనుకున్నట్ల జరిగితే సొంత స్మార్ట్‌ఫోన్‌‍లను ఉత్పత్తి చేస్తున్న తొలి ఇ-కామర్స్ వెబ్‌సైట్‌గా ఫ్లిప్‌కార్ట్ చరిత్రలో నిలుస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot