UPI సర్వీసులను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే?
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ యూపీఐ (Unified Payments Interface) సేవల్ని ప్రారంభించింది. యాక్సిస్ బ్యాంకు భాగస్వామ్యంతో ఈ సర్వీసులను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌లో చెల్లింపుల కోసం ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే ఆధారపడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని సంస్థ తెలిపింది.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ : ఫ్లిప్‌కార్ట్ యూజర్లు యాపీఐ సేవలను నిరంతరం అందించేందుకు వీలుగా ఫ్లిప్‌కార్ట్ యూపీఐ (Flipkart launched UPI Services) సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ అధికారులు వెల్లడించారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

50 కోట్ల మంది కస్టమర్లు? : ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫ్లిప్‌కార్ట్ యూపీఐ అందుబాటులో ఉందని ఫిన్‌టెక్ అండ్ పేమెంట్స్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోవడం ద్వారా చెల్లింపులు చేయవచ్చని పేర్కొన్నారు. 50 కోట్ల మంది కస్టమర్లు, 14 లక్షల మంది విక్రేతలకు ఈ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు.
ఇలా చేసి సూపర్ కాయిన్లను పొందండి : ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా వస్తువులు, రీఛార్జ్‌లు, పేమెంట్లు చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. QR స్కానర్ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ లావాదేవీలపై సూపర్ కాయిన్లు, క్యాష్‌బ్యాక్ మరియు వోచర్లు వంటి ప్రయోజనాలు పొందవచ్చు. కనీసం రూ.100 విలువైన తొలి ఐదు క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా చెల్లింపులు చేస్తే 10 సూపర్ కాయిన్లను పొందవచ్చు.

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి : ఫ్లిప్‌కార్ట్ ఆండ్రాయిడ్ యూజర్లు ఈ UPI సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకొనేందుకు.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని స్కాన్ అండ్ పే కిందనున్న మై యూపీఐ ఆప్షన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ బ్యాంకును ఎంచుకోవాలి. SMS వెరిఫికేషన్ అనంతరం ఫ్లిప్‌కార్ట్ UPI సర్వీసులు యాక్టివేట్ కానుంది.
థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడకుండా.. : ఫ్లిప్‌కార్టు యూజర్లు (Flipkart Users) .. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్‌పే వంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడకుండా నేరుగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. కొన్నిరోజుల క్రిందట జొమాటో కూడా యూపీఐ సేవలను ప్రారంభించింది.
ఆర్‌బీఐ చర్యల అనంతరం పేటీఎం పేమెంట్స్ బ్యాంకు క్రమంగా సమస్యల్లోకి కూరుకుపోతోంది. ఇలాంటి సమయంలో ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం అనుకూలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెజాన్, జొమాటో వంటి ఇతర సంస్థలు యూపీఐ సేవలను ప్రారంభించి రాణిస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ యూపీఐ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








