ఫ్లిప్‌కార్ట్ కొత్త ఆఫర్.. ఇప్పుడు కొనండి, డబ్బులు తరువాత కట్టండి

ఆన్‌లైన్ షాపర్లకు మరింత చేరువయ్యే క్రమంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, 'buy now, pay later' పేరుతో సరికొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసే ప్రొడక్ట్స్‌ను అప్పు క్రింద తీసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రా‌యిడ్ యాప్ యూజర్లకు మాత్రమే!

ప్రస్తుతానికి ఈ సదుపాయం బేటా స్థాయిలోనే ఉన్నందున ఎంపిక చేసిన ఆండ్రా‌యిడ్ యాప్ యూజర్లకు మాత్రమే ఫ్లిప్‌కార్ట్ ఈ రకమైన ఫెసిలిటీని కల్పిస్తోంది. ‘buy now, pay later' ఆప్షన్‌ను ఉపయోగించుకోవాలంటే ఫ్లిప్‌‍కార్డ్ యూజర్ వద్ద తప్పనిసరిగా క్రెడిట్ కార్డ్ ఉండాలి. క్రెడిట్ కార్డ్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఫ్లిప్‌కార్ట్ ఈ సదుపాయాన్ని అందించనుంది.

ఏ వస్తువులనైనా అప్పుగా తీసుకోవచ్చు..

‘buy now, pay later' స్కీమ్‌కు అర్హత పొందిన యూజర్లకు ఓ క్రెడిట్ లిమిట్‌ను ఫ్లిప్‌కార్ట్ సెట్ చేస్తుంది. ఆ క్రెడిట్ లిమిట్ లోపు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసే ఏ వస్తువులనైనా అప్పుగా తీసుకునే వీలుంటుంది.

తీసుకున్న అప్పును నెలలోపు చెల్లించాల్సి ఉంటుంది

తీసుకున్న వస్తువుల తాలూకా అమౌంట్‌లను మరిసటి నెల 10వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన బిల్ డిటెయిల్స్ అలానే పేమెంట్ లింక్‌ను ప్రతినెలా 1వ తేదీన ఎస్ఎంఎస్‌ను యూజర్ మొబైల్ ఫోన్‌కు ఫ్లిప్‌కార్ట్ పంపిస్తుంది.

పెనాల్టీ క్రింద రూ.400...

అమౌంట్‌ను గడువులోపు చెల్లించని పక్షంలో రూ.2000లోపు బాకీకి రూ.100, రూ.2000 నుంచి రూ.4000లోపు బాకీకి రూ.200, రూ.4000 అంతకన్నా ఎక్కువ బాకీకి రూ.400ను పెనాల్టీ క్రింద చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన ఈ సదుపాయాన్ని త్వరలోనే డెస్క్‌టాప్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart launches ‘buy now, pay later’ feature. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot