ఫ్లిప్‌కార్ట్ నుంచి Super.money UPI యాప్.. 5 శాతం క్యాష్‌బ్యాక్ సహా ప్రత్యేక రివార్డులు..!!
ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ తాజాగా కొత్త UPI యాప్ ను లాంచ్ చేసింది. సూపర్ మనీ పేరుతో అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ యాప్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. మరియు 100,000 మందికి మాత్రమే తొలుత అందుబాటులో ఉండనుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇతర యాప్‌ల (Flipkart Super Money UPI App) మాదిరిగా కాకుండా 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని హామీ ఇచ్చింది.
బ్యాంకులతో భాగస్వామ్యం :
ఫ్లిప్‌కార్ట్ సూపర్ మనీ యాప్ వినియోగదారులకు ప్రత్యేక్షంగా ప్రయోజనాలను అందిస్తుందని సంస్థ చెబుతోంది. ఇతర యాప్‌ల మాదిరిగా అవసరం లేని ఆఫర్లను, బహుమతులను అందించదని చెబుతోంది. ఈ యాప్.. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతోపాటు యాక్సెస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు తోనూ భాగస్వా్మ్యం ఉంది.

ప్రతి లావాదేవీపై రివార్డులు :
ఫ్లిప్‌కార్ట్ సూపర్. మనీ యాప్ వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందించే లక్ష్యంతో పనిచేయనుందని సంస్థ తెలిపింది. ప్రతి లావాదేవీపై రివార్డులను పొందవచ్చని పేర్కొంది. దీంతోపాటు వినియోగదారుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేయాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ సూపర్.మనీ యాప్ ద్వారా వినియోగదారులు నేరుగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మెరుగ్గా, సులభంగా నగదు బదిలీ చేసుకొనేందుకు వీలుగా బ్యాంకు ఖాతాలతో నేరుగా అనుసంధానం చేయబడి ఉందని తెలిపింది. భద్రంగా మరియు వేగంగా నగదు బదిలీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని సంస్థ చెబుతోంది.
ఆవిష్కరణలకు అద్భుతమైన అవకాశాలు :
డిజిటల్ చెల్లింపులు మరియు ఇతర ఆర్థిక లావాదేవీల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆవిష్కరణలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని సూపర్.మనీ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రకాష్ సికారియా తెలిపారు. ఆర్థిక సేవల్లో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడం తమ ఉద్దేశమన్నారు.
ఫ్లిప్‌కార్ట్ సూపర్,మనీ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం బ్యాంకు అకౌంట్లతో లింక్ చేసిన మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ కావచ్చు. తర్వాత UPI పిన్‌ను క్రియేట్ చేసుకోవాలి. అనంతరం నగదు బదిలీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని సంస్థ తెలిపింది.
సూపర్.మనీ యాప్ ద్వారా ఆర్థిక సేవల రంగంలో ఫ్లిప్‌కార్ట్ తన ఆవిష్కరణలను సూచిస్తోంది. క్యాష్‌బ్యాక్, యూజర్ ఫ్రెండ్లీ, బ్యాంకులతో మెరుగైన భాగస్వామ్యంపై దృష్టిసారించింది. రివార్డులు సహా మెరుగైన సేవల ద్వారా వినియోగదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా మెరుగైన సేవలు అందించనుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications