Home
News

భలే ఛాన్స్‌.. ఇలాంటి ఆఫర్‌ మీరు అస్సలు ఊహించి ఉండరు..!

పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సేల్ ప్రారంభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌, అమెజాన్ గ్రే‌ట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేర్లతో సేల్‌ ప్రారంభించనున్నాయి. ఇప్పటికే ఈ రెండు సేల్స్‌ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఆ తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియల్‌ సేల్‌ (Flipkart Big Billion Days Sale 2025) గురించి ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

ఎక్స్చేంజీ ఆఫర్‌ :
ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు సాధారణంగా.. స్మార్ట్‌ఫోన్‌ లు సహా ఇతర ఉత్పత్తులకు ఎక్స్ఛేంజీ ఆఫర్‌ ను ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా సేల్‌ జరుగుతున్న సమయాల్లో పాత స్మార్ట్‌ఫోన్లు సహా ఇతర గ్యాడ్జెట్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకొనేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికి ఇది నిజంగా భలే ఛాన్స్‌!

Flipkart may accept any condition phones in exchange

ఏ స్థితిలో ఉన్న ఫోన్‌ అయినా :
మీరు ఏదైనా గ్యాడ్జెట్‌ను ఎక్స్చేంజీ చేయాలంటే.. కచ్చితంగా పనిచేసే స్థితిలోనే (Working Condition) ఉండాలని ఇ-కామర్స్‌ సంస్థలు షరతులు విధిస్తుంటాయి. త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌లో ఏ స్థితిలో ఉన్నా స్మార్ట్‌ఫోన్‌ను (Any Condition) అయినా ఎక్స్ఛేంజీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

డ్యామేజీ అయినా.. స్విచ్‌ ఆన్ చేయలని స్థితిలో ఉన్నా..! :
టిప్‌స్టర్‌ ముకుల్‌ శర్మ వివరాల ఆధారంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియల్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఏ స్థితిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను అయినా ఎక్స్ఛేంజీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. డిస్‌ప్లే పగిలినా ఫోన్ అయినా.. బ్యాటరీ డ్యామేజీ అయిన ఫోన్‌ అయినా.. స్వీచ్‌ ఆన్‌ చేయలేని స్థితిలో ఉన్న ఫోన్‌ అయినా.. ఎక్స్ఛేంజీ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇదే నిజమైతే.. ఏం లాభమంటే :
ఇదే నిజమైతే ఇప్పటి వరకు ఎక్స్ఛేంజీ చేసుకొనేందుకు అవకాశం లేక మరియు వినియోగించలేక వదిలేసిన ఫోన్‌లను సులభంగా ఎక్స్ఛేంజీ చేసుకోవచ్చు. ఫలితంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు కూడా తగ్గుతాయి. మరియు యూజర్లకు నగదు కూడా ఆదా కానుంది.

సరైన విలువ దక్కకుంటే :
ఇంత వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ ఫోన్‌లకు సరైనా ఎక్స్ఛేంజీ విలువ దక్కకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. అంటే పాత ఫోన్‌లకు కేవలం రూ.100 లేదా రూ.200 ఇచ్చి సరిపెట్టుకోమంటే, యూజర్లు నష్టపోయే అవకాశం ఉంటుంది.

Flipkart may accept any condition phones in exchange

యూజర్లను ఆకట్టుకొనే మార్గం కాదు కదా?
పూర్తిగా డ్యామేజీ అయినా లేదా పనిచేయని మోడల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ రీసైక్లింగ్ చేస్తుందా.. రిపేర్‌ చేస్తుందా లేదా ఎలా ఉపయోగించుకుంటుందనే విషయాలు వెల్లడి కాలేదు. లేకుంటే యూజర్లకు ఆకట్టుకొనేందుకు ఇదో మార్గంగా భావిస్తుందా అనేది వెల్లడి కావాల్సి ఉంది.

యూజర్లు ఏం చేస్తే మంచిదంటే :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌ ప్రారంభం అయ్యాక.. మీ ఫోన్‌లపై వచ్చే ఎక్స్ఛేంజీ విలువను తనిఖీ చేయండి. అనంతరం మీ సమీపంలోని స్టోర్‌లు సహా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో ఇచ్చే ఎక్స్ఛేంజీ విలువతో సరిపోల్చవచ్చు. పనిచేసే స్థితిలో ఉండే మోడల్స్‌కు మాత్రమే ఎక్కువ ధర వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

Best Mobiles in India

English summary
Flipkart may accept old phones exchange in any condition during big billion days sale 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X