భారీ ఆఫర్ల బాటలో ఫ్లిప్‌కార్ట్

Written By:

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కష్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా అమెరికాలోని ప్రముఖ స్టార్టప్ జెట్. కామ్స్ స్మార్ట్ కార్ట్ ఆఫర్ చేసే సర్వీసుల ఆధారంగా డిస్కౌంట్ ప్రైసింగ్ మోడల్ ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ ప్రైసింగ్ మోడల్ తో అన్ని రకాల ఐటమ్స్ ని ఒకే వేదిక మీద కొనుగోలు చేసేలా కసరత్తు చేస్తోంది. దీంతో పాటు అన్ని వస్తువులను ఒకే బాక్స్ లో డెలివరీ చేయనుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తన కొత్త సర్వీసులను

ఈ నెల చివరి నుంచి ఫ్లిప్‌కార్ట్ తన కొత్త సర్వీసులను ప్రారంభించనుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ అందించే ఈ సర్వీసుల కొరియర్ ధరలు స్లాబ్ చార్జీల్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఎటువంటి అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోజుకు 25 వేల ఆర్డర్ల వరకు

జెట్.కామ్ అందిస్తున్న ఈ స్మార్ట్ కార్ట్ సర్వీసులు పట్టణ ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. కస్టమర్ల డీల్స్‌లో వివిధ రకాలైన ఆఫర్లను ఆ కంపెనీ అందిస్తోంది. ఇప్పటికే ఆ కంపెనీకి కనీసం రోజుకు 25 వేల ఆర్డర్ల వరకు నమోదవుతాయి.

ఒకేసారి మల్టిపుల్ ఉత్పత్తులను

ఒకేసారి మల్టిపుల్ ఉత్పత్తులను వినియోగదారులు ఆర్డర్ చేసినప్పుడు వాటిని ఒకే షిప్‌‌మెంట్‌లో వినియోగదారులకు అందించి, ఉత్పత్తులకు ప్రతీసారి వేసే షిప్పింగ్ చార్జీలను జెట్.కామ్ పొదుపుచేస్తోంది. ఈ రకంగా ఇటు కంపెనీకి, అటు వినియోగదారులకు లబ్దిచేకూరుతుంది.

వాల్‌మార్ట్ ఆధీనంలో

జెట్.కామ్ ప్రస్తుతం వాల్‌మార్ట్ ఆధీనంలో ఉంది. ఈ సంస్థను వాల్‌మార్ట్ 3.3 బిలియన్ డాలర్లకు కొనుగోలుచేసింది. జెట్.కామ్‌ను కొనుగోలుచేసిన వాల్‌మార్టే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మైనార్టీ స్టాక్ కోసం కూడా సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అమెజాన్‌కు పోటీగా

వారి ఉమ్మడి ప్రత్యర్థి అమెజాన్‌కు పోటీగా సేవలందించడానికి ఈ ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నా సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వాల్‌మార్ట్ ఆధీన సంస్థ జెట్.కామ్ అందిస్తున్న ఆఫర్ల ఆధారితంగా ఫ్లిప్‌కార్ట్ కూడా వినియోగదారులకు మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart may follow Jet.com model to offer discounts on single box delivery read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot